Home సినిమా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ రివ్యూ.. ప్రదీప్ రంగనాథన్ మరో హిట్ కొట్టాడా? – Andhra Waves

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ రివ్యూ.. ప్రదీప్ రంగనాథన్ మరో హిట్ కొట్టాడా? – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo


తమిళ యువ సంచలనం ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK). విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్. ప్రదీప్ రంగనాథన్ వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. పైగా ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే.. వినూత్నమైన టైటిల్, పోస్టర్లతో అందరి దృష్టిని ఆకర్షించింది. మరి ఈ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా ఎలా ఉంది? ప్రదీప్ ఖాతాలో మరో హిట్ పడిందా? (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రివ్యూ తెలుగు)

కథ:
ఈ కథ 2040వ సంవత్సరంలో జరుగుతుంది. అప్పటికి టెక్నాలజీ ఎంతలా అభివృద్ధి చెందుతుందంటే.. మనుషుల ప్రేమ వ్యవహారాలను చూసుకోవడానికి ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ యాప్ ఉంటుంది. ఈ కంపెనీకి సీఈఓ గా ఎస్.జె. సూర్య ఉంటాడు. ఎవరిని ప్రేమించాలో, ఎప్పుడు విడిపోవాలో ఆ యాప్ డిసైడ్ చేస్తుంది. దానిని గుడ్డిగా ఫాలో అవుతుంది ధీమా(కృతి శెట్టి). టెక్నాలజీపై ఆధారపడే ధీమాను.. ప్రకృతికి దగ్గరగా జీవించే వ్యక్తి వాసు (ప్రదీప్ రంగనాథన్) తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ, ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ యాప్‌లోని “లవ్ స్కోర్” ఫీచర్ ఈ ప్రేమ కథకు రెడ్ ఫ్లాగ్ వేస్తుంది. అప్పుడు వాసు ఏం చేశాడు? ధీమా మనసు గెలుచుకొని, తన ప్రేమ కథను విజయ తీరాలకు చేర్చాడా లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:
దర్శకుడు విఘ్నేష్ శివన్ ఎంపిక కొత్తగా ఉంది. అయితే ఆ కొత్త పాయింట్ ను, పూర్తి స్థాయిలో మెప్పించేలా ఆసక్తికరంగా తెరపైకి తీసుకురావడంలో మాత్రం దర్శకుడు కాస్త తడబడ్డాడు. సినిమాలో కామెడీ బాగానే వర్కౌట్ అయింది. ముఖ్యంగా ఫస్టాఫ్ చాలా వేగంగా, వినోదాత్మకంగా సాగిపోతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా మెప్పించింది.

అయితే, సెకండాఫ్‌లో కొన్ని చోట్ల నెమ్మదించినట్లు అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్‌లో ఇంకాస్త డెప్త్ ఉంటే బాగుండేది. ప్రదీప్-కృతి శెట్టి, ప్రదీప్-ఎస్.జె. సూర్య మధ్య సన్నివేశాలు పరవాలేదు. కానీ క్లైమాక్స్ ఊహకు అందేలా ఉండటం, కొన్ని డ్రామా సీన్స్ సాగదీసినట్లు అనిపించడం మైనస్ గా చెప్పుకోవచ్చు. సెకండాఫ్ లో రైటింగ్ పరంగా కేర్ తీసుకుంటే అవుట్ పుట్ ఇంకా బెటర్ గా ఉండేది.

ప్రధాన ఆకర్షణ ‘ఫ్యూచరిస్టిక్ లవ్’ అనే పాయింట్ సినిమాలో. 2040 నాటి ప్రపంచాన్ని చూపిస్తూ, అప్పటి టెక్నాలజీ సంబంధాలను ఎలా శాసిస్తుందో మనుషులు చూపించడం కొత్తగా ఉంది. విఘ్నేష్ శివన్ ఫస్టాఫ్‌ను చాలా ఎనర్జిటిక్‌గా నడిపించాడు. ప్రదీప్ బాడీ లావేజ్‌కు తగినట్లుగా రాసుకున్న డైలాగులు థియేటర్లలో నవ్వులు పూయించాయి. అయితే, సెకండాఫ్‌లో తడబాటు కారణంగా పూర్తిస్థాయి సంతృప్తి కలగదు.

ఈ సినిమాలో టెక్నాలజీ వల్ల మనుషుల మధ్య దూరం పెరుగుతుందే తప్ప తగ్గడం లేదని అంతర్లీనంగా సందేశం ఇచ్చారు. టెక్నాలజీ యుగంలోనూ మనసు విప్పి మాట్లాడుకోవడమే ప్రేమకు అసలైన ఇన్సూరెన్స్ అని ఈ సినిమా చాటిచెప్పింది.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
ప్రదీప్ రంగనాథన్ తన మార్క్ కామెడీ టైమింగ్‌తో మరోసారి అదరగొట్టాడు. ఆయన బాడీ లాంగ్వేజ్‌కు తగిన పాత్ర ఇది. ఎమోషనల్ సీన్స్‌లోనూ మెప్పించాడు. కృతి శెట్టి మంచి పాత్రలో మెరిసింది. ఆమె లుక్స్, నటనకు ప్లస్ అయ్యాయి. ప్రదీప్, కృతి మధ్య కెమిస్ట్రీ యూత్‌ను ఆకట్టుకుంటుంది. ఎస్.జె. సూర్య తనదైన నటనతో సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. యోగి బాబు కామెడీ కొన్ని చోట్ల బాగానే నవ్వులు పూయించింది.

దర్శకుడు విఘ్నేష్ శివన్ ఎంపిక చాలా కొత్తగా ఉంది. ఫ్యూచరిస్టిక్ అంశాలను చూపిస్తూనే, మన ఎమోషన్స్ కు కనెక్ట్ అయ్యేలా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం ఆకట్టుకుంది. విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:
కొత్త కాన్సెప్ట్
ప్రదీప్ రంగనాథన్ పర్ఫార్మెన్స్
కామెడీ

మైనస్ పాయింట్లు:
కొన్ని నెమ్మదిగా సాగే సీన్స్
రొటీన్ క్లైమాక్స్

ఫైనల్ గా..
కాన్సెప్ట్ బాగున్నా.. సెకండాఫ్ లో తడబాటు కారణంగా ఈ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది.

రేటింగ్: 2.25/5

నిరాకరణ: ఈ సమీక్షలో వ్యక్తీకరించబడిన వీక్షణలు సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయాలు మరియు సంస్థ ఎటువంటి బాధ్యత వహించదు. ఈ సమీక్షకు వ్యాఖ్యానించడానికి లేదా ప్రతిస్పందించడానికి ముందు వీక్షకుల విచక్షణతో సలహా ఇవ్వబడుతుంది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird