
ముద్ర, తుంగతుర్తి..
సంఘసంస్కర్త, స్వాతంత్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆదివారం తుంగతుర్తి మండల కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ భారతదేశంలో అత్యధిక సార్లు పార్లమెంటుకు ఎన్నికైన వ్యక్తి బాబు జగ్జీవన్ రావు అని ఆయన చిన్నతనం నుండే కుల విక్షత పై ఎన్నో పోరాటాలు చేసి దళితుల హక్కుల కోసం ఎనలేని కృషి చేసిన మహానీయుడు అని కొనియాడారు. ఆయన ఆశ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయడానికి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గౌండని రాములు గౌడ్ ,తడకమళ్ళ రవికుమార్ , గోపగాని రమేష్ , బొజ్జ సాయికిరణ్ , బొంకురి మల్లేష్ , నల్లబిల్లి వెంకటేష్ , బొంకూరి మధు, తడకమళ్ళ నరేష్ ,తడకమళ్ళ అనిల్ , తడకమళ్ళ మధు, బొంకూరి సాయి, కడియం గోపి, గడ్డం కారణంగా ఉన్నారు.