సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం “గేదెల రాజు”. ఈ రవి ఆనంద్ చిన్నిబిల్లి, రామచంద్రం, శ్రావ్య, వికాశ్, మౌనిక కీలక పాత్రల్లో నటించారు. మోటూరి టాకీస్ పతాకంపై కుంచె సమర్పిస్తున్న ఈ చిత్రానికి రఘు చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు. వాణి రవికుమార్ మోటూరి నిర్మించారు. “గేదెల రాజు” సినిమా నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జర్నలిస్ట్ మిత్రుల చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో
నటి శ్రావ్య మాట్లాడుతూ – జర్నలిస్ట్ మిత్రుల చేతుల మీదుగా మా సినిమా ట్రైలర్ రిలీజ్ హ్యాపీగా ఉంది. మా మూవీని మీరే ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలి. రఘు కుంచె గారితో కలిసి నటించడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ మీ అందరినీ ఇంప్రెస్ చేసేలా ఉంటుంది. అన్నారు.
నటి మౌనిక మాట్లాడుతూ – మా “గేదెల రాజు” సినిమా ట్రైలర్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో సినిమా అంతకంటే బాగా ఉంటుంది. ఈ సినిమాకు రఘు కుంచె గారి మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో నేను ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను. ఈ నెల 17న థియేటర్లలో సినిమా చూసి మీ రెస్పాన్స్ కోరుకుంటున్నారని. అన్నారు.
నటుడు రవిఆనంద్ చిన్నిబిల్లి మాట్లాడుతూ – మా టీమ్ అంతా ఎంతో ప్యాషన్ గా కష్టపడి పనిచేసిన సినిమా ఇది. ఈ సినిమాకు దాదాపు అందరూ కాకినాడ వాళ్లే వర్క్ చేశారు. రఘు కుంచె గారు మా అందరికీ మంచి గైడెన్స్ ఇచ్చి ముందుండి నడిపించారు. మాలాంటి కొత్త వాళ్లకు మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాం. అన్నారు.
కోడ్యూసర్ తాడల వీరభద్రరావు మాట్లాడుతూ – రఘు కుంచె గారు మంచి మ్యూజిక్ తో పాటు ఈ సినిమాలో తన నటనతో మనందరినీ ఆకట్టుకుంటారు. గేదెల రాజు సినిమా ప్రేక్షకులకు కావాల్సిన ఎన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా. మిమ్మల్ని థియేటర్స్ లో బాగా ఎంటర్ టైన్ చేస్తుంది. అన్నారు.
ప్రొడ్యూసర్ వాణి రవికుమార్ మోటూరి మాట్లాడుతూ – డైరెక్టర్ చైతన్య మోటూరి మా అబ్బాయి. సినిమా మీద ఉన్న ప్యాషన్ ను ఎంకరేజ్ చేయడానికి అతనికి ఈ సినిమా నిర్మించాం. ట్రైలర్ చాలా బాగుందని ప్రశంసలు వస్తున్నాయి. మా అబ్బాయిని దర్శకుడిగా మీరంతా ఆశీర్వదిస్తారని, మా సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అన్నారు.
నటుడు రామచంద్రం మాట్లాడుతూ డైరెక్టర్ – నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసినప్పటి నుంచి ఈ మూవీ చైతన్య నాకు పరిచయం. నటుడిగా నాకు ఇది ఫస్ట్ మూవీ. మా సినిమా మీద పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉన్నాం. అందుకే మీడియా మిత్రులతో మా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశాం. ఈ నెల 17న థియేటర్లకు రండి, తప్పకుండా మూవీని ఎంజాయ్ చేస్తారు. అన్నారు.
నటుడు కిష్టయ్య మాట్లాడుతూ – రఘు కుంచె గారికి రాని విద్య ఏదైనా ఉందా అని సందేహం. ఆయన నట విశ్వరూపం ఈ సినిమాలో చూస్తారు. ఒక ఎస్వీఆర్ ను, కైకాల సత్యనారాయణ గారిని గుర్తుకుతెస్తారు. ఎస్పీ బాలు, ఘంటసాల గారిలా ఆయనది మంచి గాత్రం. ఆయన తన కంపోజింగ్ తో ఇళయరాజాను గుర్తుకుతెస్తారు. అన్నారు.
నటుడు, చిత్ర సమర్పకులు రఘు కుంచె మాట్లాడుతూ – ప్రతి సినిమాకు పనిచేసిన వారు మేము కష్టపడ్డామనే చెబుతారు. మా సినిమా బాగుందనే అంటారు. మేము ఎవరెన్ని చెప్పినా థియేటర్స్ కి ప్రేక్షకులను రప్పించేది కంటెంట్ మాత్రమే. సినిమా రిలీజ్ అయ్యాక ఆ మూవీలో కంటెంట్ ఉందని ప్రేక్షకులు అనుకుంటే తప్పకుండా సినిమాను ఆదరిస్తారు. మా మూవీలో మంచి కంటెంట్ ఉందని మేము నమ్ముతున్నాం. ఈ ట్రైలర్ తో మా మూవీ మీద మీకొక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ట్రైలర్ మా మూవీ బాగుంటుందని మీకు నచ్చితే ఈ నెల 17న థియేటర్లలోకి వచ్చి మా సినిమా సక్సెస్ చేయండి. అన్నారు.
చైతన్య మోటూరి మాట్లాడుతూ – గేదెలరాజు కాకినాడ తాలూక ఈ సినిమాకు మేము పెట్టిన క్యాప్షన్ చూస్తే ఒక్కటే నిజం, చూడకపోతే వంద అనుమానాలు. ఈ క్యాప్షన్ లోనే కథ సారం ఉంది. గేదెల రాజు కథ ఇదే. ఒక మర్డర్ మిస్టరీని, ఒక క్రైమ్ థ్రిల్లర్ ను రెండు గంటల ఒక్క నిమిషం నిడివిలో క్రిస్ప్ గా ప్రదర్శించాం. ఫస్ట్ సీన్ నుంచే కథలోకి వెళ్తారు. ఈ మూవీలో హీరోలు, విలన్స్ ఎవరూ ఉండరు. పాత్రలు మాత్రమే ఉంటాయి. ఆ పాత్రల జీవితం మాత్రమే ఉంటుంది. సినిమా చివరి 40 నిమిషాలు చాలా స్ట్రాంగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. మేము ప్రేక్షకులు ఒక్క రూపాయి లేదా ఒక్క నిమిషం అయినా వృథా చేయాలనుకోవడం లేదు. అందుకే క్రిస్పీగా ఇంతమంచి సినిమా ఇచ్చేందుకు కష్టపడ్డాం. మలయాళ సినిమాలు బాగుంటాయని మనం అనుకుంటాం, మలయాళం వాళ్లు తెలుగు సినిమాలు బాగా తెరకెక్కిస్తారని అంటారు. అలా వాళ్లు చెప్పుకునేలా మా గేదెల రాజు సినిమా ఉంటుంది. ఈ సినిమా కోసం మేము చాలా ప్రయోగాలు చేశాం. పల్లెటూరి కొత్త గాయకులతో పాటలు పాడించాం. రఘు గారి మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఈ సినిమాలో లీడ్ రోల్ తో పాటు మ్యూజిక్ ఇచ్చారు ఓ పాట పాడారు. ఆ పాటను నేను ఎన్నోసార్లు విన్నాను. అలాగే సూపర్బ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. మేకింగ్ లో మేము ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. 84 లొకేషన్స్ లో ఈ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్ ఎప్పుడైనా బాగా ప్రదర్శించబడుతుంది. రెండున్నర నిమిషాల ఫైట్ సీక్వెన్స్ ను అరవై మంది కొత్తవాళ్లతో చేశాం. అలాగే కాకినాడలో రియల్ క్రౌడ్ మధ్య షూటింగ్ జరిగింది. ఈ సినిమాకు నేను థ్యాంక్స్ చెప్పాలంటే ఓ పుస్తకం రాయాలి. సక్సెస్ మీట్ లో వారి గురించి మాట్లాడతా. అన్నారు.