ఉద్రిక్తతకు దారి తీసిన ఘటన ఒకటి హైదరాబాద్‌లో శనివారం (ఏప్రిల్ 4) ఉదయం జరిగింది. ఎల్బీ నగర్ సమీపంలోని చింతల్‌కుంట ప్రాంతంలో ఉన్న ప్రసార భారతి రేడియో టవర్‌పై ఓ వ్యక్తి ఎక్కి నానా రచ్చ రచ్చ చేశాడు. అది చూసిన స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురై వెంటనే పోలీసులకు అందించారు. జానీ అనే వ్యక్తి రేడియో టవర్ ఎక్కి ముఖ్యమంత్రితో మాట్లాడే వరకు దిగనే దిగను అంటూ హల్ చల్ చేశాడు. జానీ ఆటోపుకుంటూ జీవనోపాధి కొనసాగి స్తున్నాడు. గ్యాస్ సమస్య కారణంగా ఆటో సరిగా నడపలేకపోతున్నానని తాను తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటు న్నానొ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ సమస్యపై నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడాలని కోరాడు. అందుకే తాను టవర్ ఎక్కినట్లుగా పోలీసులకు తెలిపాడు . టవర్ ఎక్కే ముందు తన ఆటోను కింద పార్క్ చేసి పైకి ఎక్కినట్లుగా పోలీసులు పేర్కొన్నారు.టవర్‌పైకి ఎక్కిన అనంతరం అతను డయల్-100కు కాల్ చేసి తన పరిస్థితిని తెలియ జేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే వనస్థలిపురం పోలీసులు, హైడ్రా సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపుచేసి ఆటో డ్రైవర్ జానీతో సంప్రదింపులు జరిపారు.
