టెక్నాలజీ మనుషుల జీవితాలను మార్చే శక్తి అని ఐఐటీ కాన్పూర్ నిరూపించింది. ప్రమాదవశాత్తు చేతులు కోల్పోయిన వారికి సరికొత్త ఆశలు కల్పిస్తూ, కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేసే ఒక అద్భుతమైన ఆర్టిఫిషియల్ హ్యాండ్ శాస్త్రవేత్తలు రూపొందించారు.
ఇది కేవలం ఒక పరికరం కాదు, దివ్యాంగుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపే టెక్నికల్ రివల్యూషన్. ఈ బయోనిక్ హ్యాండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథమ్స్ ద్వారా పనిచేస్తుంది. బయో గ్లాస్ మోడల్లో 12 రకాల విభిన్న మూవ్మెంట్స్ ఉంటాయి. ఇది వినియోగదారుల సంకేతాలను లేదా ముందే ప్రోగ్రామ్ చేసిన ఐఐ కమాండ్లను అర్థం చేసుకోండి, వస్తువులను పట్టుకోవడం, రాయడం, చేయిని వివిధ దిశల్లో తిప్పడం వంటి పనులను అతి సులువుగా చేయగలదు. ఇది రీఛార్జబుల్ బ్యాటరీతో నడుస్తుంది కాబట్టి మొబైల్ ఫోన్ లా చాలా సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు.
సాధారణ కృత్రిమ చేతులు చూడటానికే బాగుంటాయి, కానీ పనులు చేయడం కష్టం. కానీ ఈ ఏఐ చేయి మనిషి సొంతం చేసుకుంటుంది. తక్కువ ఖర్చుతో, అత్యాధునిక చిత్రాలతో తయారవ్వడం వల్ల ఇది ప్రపంచవ్యాప్తంగా టెక్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
గ్లాసు పట్టుకోవడం, బ్రష్ చేయడం, తలుపులు తీయడం వంటి పనులే కాకుండా, కంప్యూటర్ కీబోర్డ్ వాడటం లేదా చిన్న చిన్న వస్తువులను అమర్చడం వంటి పనులు కూడా ఈ బయోనిక్ హ్యాండ్ ద్వారా సులభంగా చేసుకోవచ్చు. అన్నిటికీ మించి ఈ బయోనిక్ హ్యాండ్ దివ్యాంగులకు బోలెడంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.
రాబోయే రోజుల్లో ఈ ఏఐ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందితే, స్పర్శను కూడా అనుభవించగలిగే సెన్సార్ చేతులు అందుబాటులోకి వచ్చే అవకాశం లేకపోలేదంటున్నారు సైంటిస్టులు. అదే జరిగితే వైద్య రంగంలో భారీ మార్పులకు ఈ బయోనిక్ హ్యాండ్ నాంది.
