-రామభక్తులని విశేషంగా ఆకట్టుకుంటున్న రామాయణం
-నిమిషాల్లోనే రికార్డు వ్యూస్
-మాటలు చాలవు
-ఏ రికార్డు మిగలదా!
-టీజర్ లో ఉన్న అంశాలేంటి
మొత్తం అర్థమైంది.. చాలా క్లియర్ కట్ గా.. ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా.. రామాయణ(రామాయణం)మూవీ భారతీయ చిత్రపరిశ్రమలో రాముడి సాక్షిగా ఒక పెను ప్రభంజనం సృష్టించబోతుందనే విషయం మొత్తం అర్థమైంది. ఈ విధంగా పొగుడుతూ ఎంత రాసినా వర్ణించడానికి పదాలు చాలవు. కొత్త పదాలని కనిపెట్టాల్సిన పరిస్థితి. అంతలా ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా రిలీజైన టీజర్ ఉంది. ‘రామ’ అంటూ సుమారు రెండు నిమిషాల ఇరవై రెండు సెకన్ల నిడివితో ఉండగా ఉన్న పళంగా రామభక్తుల చేత రామ నామం జపించేలా కూడా చేస్తుంది. మరి టీజర్ లో ఉన్న రామ అంశాలేంటో చూద్దాం.
సీతమ్మ తల్లి, లక్ష్మణుడితో కలిసి రాముడు వనవాసానికి వెళ్లడం. వనవాసంలో రాక్షసులతో పోరాటం, హనుమంతుడి నుంచి రామ అనే వాయిస్ రాగానే రాముడు వెనక్కి తిరగడం, తన అయోధ్య రాజ్యానికి వచ్చి పట్టాభిషేకం అవ్వడం,ప్రజల హర్షద్వానాలు ఇలా ప్రతి రామ భక్తులని భక్తి పారవశ్యంలో ముంచెత్తుతుంది. రాముడి నుంచి వచ్చే పోరాట సన్నివేశాలతో పాటు అన్ని విభాగాల్లోను ఇంతవరకు సెల్యులా పై తెరకెక్కించిన అన్ని రామాయణాల కంటే అద్భుతమైన ప్రపంచం సాక్షాత్కారం కాబోతుందని అర్ధమవుతుంది.
అధర్మం వల్ల లోకం అస్తవ్యస్తమైనప్పుడు, దానిని సరిచెయ్యడానికి ఎల్లప్పుడూ ఆయనే వస్తాడు. ఐదు వేల సంవత్సరాలుగా మన హృదయాల్ని పరిపాలిస్తున్న రక్షకుడు, మన నాయకుడు పురాణ పురుషుడు అని ఇచ్చిన క్యాప్షన్ మాటలైతే రామభక్తుల హృదయ అంతరాలని తట్టి లేపుతున్నాయి. రాముడు రామభక్తుల హృదయాల్లో సదాకొలువు తీరి ఉంటాడు కాబట్టి మేకర్స్ చాలా తెలివిగా ఎలాంటి వాయిస్ ఓవర్ లేకుండా టీజర్ రిలీజ్ చెయ్యడం టీజర్ కి మరింత వన్నె తెచ్చింది.
ఇది కూడా చదవండి: Euphoria:యుఫోరియా ఓటి డేట్ ఇదే.. మరి ఆ పని చేసారా
ఇక చివర్లో రావణుడి క్యారక్టర్ ని కూడా ఎస్టాబ్లిష్ చేసారు. కానీ ఫేస్ ని చూపించలేదు. అసలు మొత్తం టీజర్ లో ఒక్క రాముడి ఫేస్ ని మాత్రమే రివీల్ చేసారు. రాముడిగా రణబీర్ కపూర్ పర్ఫెక్ట్ గా సూటయ్యాడు. ఎంతలా అంటే ఫ్యూచర్ లో ఎక్కడైనా రాముడి గుడి కడితే తన రూపంతో కట్టినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఏ ఆర్ రెహ్మాన్, హాన్స్ జిమ్మెర్ లు తమ ఆర్ ఆర్ తో రామాయణకి ఎంతలా ప్రాణం పోస్తున్నారో టీజర్ కూడా చెప్తుంది. ప్రెజెంట్ రామభక్తులైతే టీజర్ ని చూసి తమ జన్మ ధన్యమయినట్టుగా మురిసిపోతున్నారు. ప్రైమ్ స్టూడియోస్ పై నమిత్ మల్హోత్రా(నమిత్ మల్హోత్రా) నిర్మిస్తుండగా నితీష్ తివారి(నితేష్ తివారీ)దర్శకుడు. రెండు పార్టులుగా తెరకెక్కనుండగా ఈ ఏడాది దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండవ భాగం విడుదల కానున్నాయి. సాయి పల్లవి సీతమ్మ తల్లిగా చేస్తున్న విషయం తెలిసిందే.
