Home Latest News ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత బిల్లు.. వ్యతిరేకిస్తూ వైసీపీ వాకౌట్ | ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధమైన హోదా కల్పించేందుకు బిల్లు | ycp | వాకౌట్ – Andhra Waves

ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత బిల్లు.. వ్యతిరేకిస్తూ వైసీపీ వాకౌట్ | ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధమైన హోదా కల్పించేందుకు బిల్లు | ycp | వాకౌట్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


అమరావతి ఆంధ్రప్రదేశ్ కు శాశ్వత, ఏకైక రాజధాని విషయంలో వైసీపీ కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. లోక్ సభలో బుధవారం (ఏప్రిల్ 1)న ఇందుకు సంబంధించిన బిల్లును కేంద్రం ప్రవేశ పెట్టింది. కాగా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి.. అమరావతికి తాము వ్యతిరేకం కాదని అంటూనే బిల్లు స్వరూపాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. రాజధానిని ఎప్పటిలోగా నిర్మిస్తారో ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదు.

ఈ బిల్లుపై చర్చలో పాల్గొన్న బీజేపీ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంలో ఏపీ ప్రస్థానం ప్రారంభమైంది. నాడు ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అంశంలో అస్థిరత ఏర్పడిందని. అమరావతి కోసం 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని, ఏపీకి అమరావతే శాశ్వత రాజధానిగా ఉంటుందని పురందేశ్వరి స్పష్టం చేశారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird