Home Latest News ఇది ఆంధ్రులకు దక్కిన గౌరవం.. చంద్రబాబు | ఇది ఆంధ్రులకు దక్కిన గౌరవం | cm | cbn | అమరావతి | బిల్లు. పాసయ్యాడు – Andhra Waves

ఇది ఆంధ్రులకు దక్కిన గౌరవం.. చంద్రబాబు | ఇది ఆంధ్రులకు దక్కిన గౌరవం | cm | cbn | అమరావతి | బిల్లు. పాసయ్యాడు – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రులకు దక్కిన గౌరవంగా అభివర్ణించారాయన.

ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో చేసిన ఓ పోస్టు గత పాలనలో ఎదురైన చీకట్లు తొలగిపోయాయి, అమరావతి పై ఉన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడింది. రైతుల త్యాగానికి, ఆకాంక్షలకు దక్కిన గౌరవం అని పేర్కొన్నారు. లోక్ సభలో అమరావతి బిల్లు ఆమోదం స్వర్ణాంధ్ర నిర్మాణంలో కీలక మైలురాయి అని చంద్రబాబు.. ఇక అమరావతి అజేయం..అజరామరమన్నారు.

రాజధానిని విశ్వనగరంగా తీర్చిదిద్ది ప్రపంచ పటంలో నిలుపుతామని భరోసా ఇచ్చారు. బిల్లు ఆమోదానికి సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి, హోం మంత్రి అమిత్ షాకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే లోక్ సభలో బిల్లుకు మద్దతు పలికిన అన్ని పార్టీలకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియచేశారు.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird