Home Latest News భార్యాభర్తల బంధంలో దూరం పెరగడానికి గొడవలే కాదు.. ఇవి కూడా కారణాలే! | భార్య భర్తల మధ్య తేడా | జంటలు వాగ్వివాదాల కంటే ఎక్కువగా ఎందుకు విడిపోతారు | భార్యాభర్తల మధ్య దూరం – Andhra Waves

భార్యాభర్తల బంధంలో దూరం పెరగడానికి గొడవలే కాదు.. ఇవి కూడా కారణాలే! | భార్య భర్తల మధ్య తేడా | జంటలు వాగ్వివాదాల కంటే ఎక్కువగా ఎందుకు విడిపోతారు | భార్యాభర్తల మధ్య దూరం – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకమైనది. నేటికాలంలో భార్యాభర్తల బంధం పెళుసుగా మారిందని చెప్పవచ్చు. బార్యాభర్తలు గొడవ పడటం అనేది చాలా కామన్ గా మారింది. అయితే కొన్నిసార్లు గొడవలు కాస్తా బంధాన్ని విచ్చిన్నం చేసే దిశగా కూడా సాగుతాయి. చాలామంది భార్యాభర్తలు గొడవలు జరిగిన తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగిందని చెబుతూ ఉంటారు. కానీ నిజానికి గొడవలే కాదు.. భార్యాభర్తల మధ్య దూరం పెరగడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. కొన్ని అలవాట్లు భార్యాభర్తల మధ్య బంధాన్ని విచ్చిన్నం చేస్తాయని అంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు. బంధాన్ని నాశనం చేసే అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే..


తప్పులు వెతకడం..

భార్యాభర్తల బంధం ముడిపడింది అనగానే పూర్తీగా ఒకరి చేతిలో బంధం కంట్రోల్ లో ఉండాలని అనుకుంటారు కొందరు. మరీ ముఖ్యంగా భర్తలు ఇలా ఎక్కువ చేస్తారు. వారు నిలబడే తీరు, ధరించే దుస్తులు, చేసే పనులు ఇలా.. ప్రతి విషయంలో తప్పులు వెతకడం చేస్తుంటారు. అలా తప్పులు చూపించడం తమ గొప్ప అని వారు అనుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల లైఫ్ పార్టనర్ చాలా ఇబ్బంది పడతారు. అదే ఎక్కువ కాలం సాగితే.. మా ఇద్దరికి సెట్ కావడం లేదు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇది కాస్తా బంధం పెళుసుబారడానికి.

మౌనం..

భార్య లేదా భర్తలో ఎవరైనా సరే.. ఎవరైనా తమకు నచ్చని పని జరిగినప్పుడు లేదా మీకు ఏ విషయంలో అయినా ఇబ్బంది ఏర్పడినప్పుడు దాని గురించి మాట్లాడటం కంటే.. మౌనంగా ఉండి భాగస్వామిని సాధిస్తూ ఉంటారు. ఈ పద్ధతి చాలా హానికరమైనది. భాగస్వామిని పట్టించుకోకుండా మానసిక హింసకు గురి చేయడం లాంటిది. ఆరోగ్యకరమైన సంబంధానికి, మనసు విప్పి ఓపెన్ గా మాట్లాడటం చాలా అవసరం. మౌనంగా ఉండటం వల్ల భాగస్వామి అభద్రతా భావానికి లోనయ్యే అవకాశం ఎక్కువ, అంతేకాదు.. ఇలాంటి ప్రవర్తన వల్ల బంధంలో దూరం పెరుగుతుంది.

పాత విషయాలు..

బార్యాభర్తలలో చాలామంది పాత విషయాలను బయటకు లాగి వాటిని తమకు అనుగుణంగా గొడవలు చేసుకుంటారు. భాగస్వామి చేసిన తప్పును ఒకసారి క్షమించండి.. తరువాత వాదన జరిగిన ప్రతిసారి ఆ తర్వాత తిరిగి ప్రస్తావించకూడదు. ఇలా చేయడం వల్ల భాగస్వామి నమ్మకం దెబ్బతింటుంది, ఇంకా పాత విషయాలు మనసులో పెట్టుకున్నాయని, బంధంలో అర్థం చేసుకునే తత్వం లేదని అనుకుంటారు.

ఆధిపత్యం..

ప్రేమ అంటే భాగస్వామి ఫోన్‌ను నిరంతరం రహస్యంగా చూడటం, వారు ఎలా ఉంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు, గూఢచర్యం చేసినట్టు బిహేవ్ చేయడం, ఇవన్నీ కాదు.. చాలామంది వీటిని చేస్తూ ఆధిపత్యం ప్రదర్శిస్తూ దాన్ని ప్రేమ అని అనుకుంటారు. కానీ ఇలా ప్రవర్తిస్తే అది వ్యక్తి స్వేచ్ఛను హరించినట్టే.. ఇలా చేయడం వల్ల ఎదుటి వ్యక్తికి బంధంలో నమ్మకం పోతుంది.

పోలిక..

లైఫ్ పార్ట్నర్ ను ఇతరులతో పోల్చడం మంచిది కాదు. భాగస్వామి స్నేహితులు, వారి స్నేహితులు, అక్క చెల్లెళ్లు, అన్నదమ్ములు ఇలా అందరితో పోల్చడం మంచిది కాదు. ప్రతి వ్యక్తికి బలాలు, బలహీనతలు ఉంటాయి. పోలికల వల్ల భాగస్వామి బాధపడవచ్చు. బంధంలో ఎప్పటికీ వ్యక్తిని ఉన్నది ఉన్నట్లుగా యాక్సెప్ట్ చేయగలిగింది.అప్పుడే బంధం బాగుంటుంది. లేదంటే బంధం విచ్చినమవుతుంది.

*రూపశ్రీ

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird