గుండె శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. దానిని సరిగ్గా జాగ్రత్తగా చూసుకోకపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామందికి తెలియకుండానే కొన్ని అలవాట్లు అలా కంటిన్యూ అవుతారు. పైగా అవన్నీ చాలా ఆరోగ్యమైనవే అని అనుకుంటూ ఉంటారు. గుండె అయితే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రాత్రిపూట నివారించాల్సిన కొన్ని అలవాట్లు ఇక్కడ ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..
రాత్రి భోజనం..
రాత్రిపూట భోజనం గురించి చాలామందికి ఒక నిర్లక్ష్యం ఉంటుంది. చాలామంది బాగా పుష్టిగా తింటారు. కానీ రాత్రి బోజనం అతిగా తినడం గుండె ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే రాత్రి బోజనం అతిగా తినకూడదు. రాత్రి అతిగా తింటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి, రక్త ప్రసరణ, గుండె పనితీరు ప్రభావితం కావచ్చు.
కాఫీ..
కొందరికి గంట గంటకు కాఫీ తాగే అలవాటు ఉంటుంది. రాత్రి భోజనం తర్వాత కూడా కాస్త కాపీ సిప్ చేస్తారు. కానీ కాఫీలో కెఫీన్ ఉంటుంది. ఇది నిద్రను ప్రభావితం చేస్తుంది. తగినంత నిద్ర లేకపోతే గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది.
ఫోన్..
రాత్రి పూర్తీగా కళ్లు మూత పడేవరకు పోన్ ను వాడేవారు చాలా మంది ఉంటున్నారు. అయితే రాత్రి పడుకునే ముందు ఫోన్‌ను ఉపయోగించుకోవాలి. రాత్రి పూట పోన్ ఎక్కువ చూస్తే ప్రశాంతమైన నిద్ర పట్టదు. పైగా మెదడు, కళ్లు చాలా అలసిపోతాయి. గుండె ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
చిరుతిళ్లు..
కొంతమందికి రాత్రి భోజనం తర్వాత కూడా కాఫీ తాగే అలవాటు ఉంటే.. మరికొందరికి నిద్రపోయే ముందు చిరుతిండి తినే అలవాటు ఉంటుంది. దీనివల్ల ఆకలి తగ్గడమే కాకుండా, నిద్ర కూడా ప్రభావం అయ్యే ప్రభావం ఉంటుంది. తగినంత నిద్ర లేకపోవడం గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
ఒత్తిడి..
నేటి కాలంలో చాలా మంది ఫిర్యాదు చేస్తున్న ఒత్తిడి. అధిక ఒత్తిడి చాలా ప్రమాదం. అధిక ఒత్తిడి ఉన్నప్పుడు, కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది అధిక రక్తపోటుకు, గుండె ఆరోగ్యం దెబ్బతినడానికి దారితీయవచ్చు.
మద్యం..
రాత్రి పడుకునే ముందు మద్యం సేవించడం చాలామంది మగవారికి అలవాటు. ఈ అలవాటు వల్ల రక్తపోటు పెరిగి గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి మద్యం సేవించడాన్ని మానుకోవడం మంచిది.
*రూపశ్రీ.
