
రేవంత్, కేటీఆర్ ఇద్దరూ ఒక్కటే
ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్ పై చర్యలేవీ..?
ముద్ర, కరీంనగర్ :
ఫార్ములా ఈ-రేసు కేసులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నేతలు.. ఇప్పటివరకు కేటీఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం కారణంగానే చర్యలు తీసుకోవడం లేదని అనుమానం కేటీఆర్ వ్యక్తం చేశారు. ఆదివారం కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ – బీజేపీ పొత్తు ఎప్పటికీ జరగదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు బీజేపీ ఎప్పుడూ దూరమే అని. దానితో పాటు వారసత్వ, కుటుంబ రాజకీయాలకు కూడా బీజేపీ దూరమే అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి డిప్రెషన్లో ఉండి డీలిమిటేషన్‌పై మాట్లాడుతున్న దృశ్యం. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరును తప్పుబట్టిన బండి సంజయ్ చట్ట సభల్లో సభ్యులు గౌరవంగా నడుచుకోవాలని హితవు పలికారు. పదిమందికి ఆదర్శంగా ఉండాల్సిన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఇలా ప్రవర్తించడం మంచి పద్దతి కాదని చెప్పారు. రాష్ట్రంలో అసెంబ్లీ కమిటీ లేదు.. ఎథిక్స్ కమిటీ లేదు.. లేని కమిటీకి కౌశిక్ రెడ్డి రికమండ్ చేయడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.