Home Latest News మన్యంలో కుప్పకూలిన డ్రోన్.. ఏంజరిగిందంటే? | ఏజెన్సీ ప్రాంతంలో డ్రోన్ క్రాష్ | అత్యవసర | వైద్య | రైలు | ప్రజలు | భయపడ్డాను – Andhra Waves

మన్యంలో కుప్పకూలిన డ్రోన్.. ఏంజరిగిందంటే? | ఏజెన్సీ ప్రాంతంలో డ్రోన్ క్రాష్ | అత్యవసర | వైద్య | రైలు | ప్రజలు | భయపడ్డాను – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో డ్రోన్ కుప్పకూలిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఓవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొని ఉండటం.. నిత్యం డ్రోన్ దాడులకు సంబంధించిన వార్తలు వినవస్తుంటే ఆకాశాన్ని అంటుతున్న ఓ డ్రోన్ పడిపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. జి.మాడుగుల మండలం బొయితిలి సమీపంలో ఈ ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.

ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గ్రామాలకు అత్యవసరమైన వైద్య సేవలు రెడ్ వింగ్ సంస్థతో కలిసి డ్రోన్ల ద్వారా ప్రభుత్వం అత్యవసర మందులను వేగంగా తరలించడానికి సంకల్పించింది. ఏప్రిల్ ఎమర్జెన్సీ మెడికల్ ట్రయల్ ప్రారంభించింది.

ఆ ట్రయల్ రన్ లో ఉన్న డ్రోన్ బొయితిలి గ్రామ పరిసరాల్లో కూలిపోయింది. ఈ సంఘటన జరిగిన సమయంలో ఆ పరిసరాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. డ్రోన్ల ద్వారా అత్యవసర వైద్య సేవలు జరుగుతున్న ట్రయల్‌రన్‌లో భాగంగా ఈ ఘటన జరిగినట్లు అధికారులు ధృవీకరించారు. ఎటువంటి ఆందోళన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird