రాజమహేంద్రవరంలో కల్తీ పాలు కలకలం సృష్టించాయి. కల్తీ పాలు తాగి రాజమహేంద్రవరం చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ కాలనీలో ఇద్దరు మరణించారు. మృతెలలొ చౌడేశ్వర్ నగర్‌కు చెందిన కృష్ణవేణి , కనకరత్నంగా పేర్కొన్నారు. మరో 13 మంది అశ్వస్థతకు ఉన్నారు. బాధితులంతా వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో బాధపడుతున్నారు. కల్తీపాలు సేవించడమే ఇందుకు కారణమంటున్నారు. కాగా చౌడేశ్వరి నగర్ లో గత 5 రోజులుగా కల్తీ పాల కారణంగా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వీరంతా ప్రైవేట్ ఆస్పత్రుల్లో వీరంతా చికిత్స పొందుతున్నారు. తాజాగా చికిత్స పొందుతూ మరణించడం, అలాగే సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోన్న ఇద్దరు బాధితులు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కల్తీ పాల ఘటనపై అధికారులను ఆరా తీశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. బాధితులకు అందుతున్న వైద్య సహాయంపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారిని తీసుకున్నారు.కల్తీ పాలు సరఫరా అయిన కాలనీలలో 13 బృందాలతో ఇంటింటి సర్వే చేశారు.
