తెలంగాణలో మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. కేంద్ర కీలక స్థాయి బాధ్యతలు అగ్రనేత దేవ్’ పోలీసుల ఎదుట లొంగిపో తెలంగాణ విశ్వసనీయ సమాచారం వెలుగులోకి వచ్చింది. కేంద్ర కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్న దేవ్‌జీ లొంగుబాటు మావోయిస్టు పార్టీలో పెద్ద పరిణామంగా భావిస్తున్నారు. ఇంకా కీలకమైన దేవ్‌జీతో పాటు మరో నేత మల్లా రాజిరెడ్డి పోలీసుల ముందు లొంగిపో వివరాలను కూడా గుర్తించారు. ఈ ఇద్దరూ పార్టీ కార్యక్రమాల్లో దీర్ఘకాలంగా పాత్ర పోషించిన నాయకులుగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా కేంద్ర స్థాయి వ్యూహాత్మక నిర్ణయాల్లో దేవ్జీ పాత్ర ఉండటంతో, ఆయన లొంగుబాటు మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బగా మారనుంది.
ఇటీవల భద్రతా బలగాల ఒత్తిడి, అడవుల్లో మారిన పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాలు, పునరావాస విధానాలు ప్రభావం చూపడంతో ఇతర మావోయిస్టులు ప్రధాన ప్రవాహంలోకి రావడానికి ఆసక్తి చూపుతున్న పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అదే దిశగా ఈ లొంగుబాట్లు కూడా జరుగు తున్నట్లు సమాచారం. లొంగుబాటు అనంతరం ప్రభుత్వం ప్రకటించిన పునరావాస పథకాలు అమలు చేయాలన్నారు. ఆయుధాలను వదిలి సామాజిక జీవితం రావాలని రాష్ట్ర పోలీసులు మరోసారి మావోయిస్టులకు పిలుపునిచ్చారు. ఈ లొంగుబాటు నేపథ్యంలో మావోయిస్టు కార్యకలాపాలపై మరింత ప్రభావం చూపే అవకాశ ముందని భద్రతా బలగాలు అంచనా వేస్తున్నాయి.
