తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు హైదరాబాద్ నాంపల్లిని ఇంటర్ బోర్డు కార్యాలయం ముట్టడించారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, నాయకులు ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని శనివారం (ఫిబ్రవరి 21) ముట్టడించారు.
సెకండ్ ఇయర్ చదువు తున్న వారికి హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇంటర్ బోర్డు అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో అధికారులు చెలగాటం ఆడ పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించి, హాల్ టికెట్లు జారీ చేసి, పరీక్షలకు వెంటనే హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
లేదంటే ఆందోళనను మరింత ఉధృతం చేశారు.ఈ సందర్భంగా ఇంటర్ బోర్డుకు ప్రవేశించేందుకు విద్యార్థులు, ప్రయత్నించడంతో పోలీసులు వారిని నిలువరించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. కార్యాలయం వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని నియంత్రించారు.
