Home Latest News టీ 20 ప్రపంచకప్… సూపర్-8లోకి వెస్టిండీస్ | T20 వరల్డ్ కప్| వెస్టిండీస్| నేపాల్| జాసన్ హోల్డర్| షిమ్రాన్ హెట్మెయర్| బ్రాండన్ కింగ్| సూపర్ 8| దీపేంద్ర సింగ్ ఐరీ| ICCI| బీసీసీఐ| ముంబై – Andhra Waves

టీ 20 ప్రపంచకప్… సూపర్-8లోకి వెస్టిండీస్ | T20 వరల్డ్ కప్| వెస్టిండీస్| నేపాల్| జాసన్ హోల్డర్| షిమ్రాన్ హెట్మెయర్| బ్రాండన్ కింగ్| సూపర్ 8| దీపేంద్ర సింగ్ ఐరీ| ICCI| బీసీసీఐ| ముంబై – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


టీ20 ప్రపంచ కప్2026లో వెస్టిండీస్ మూడు వరుస విజయాలతో సూపర్ 8కు అర్హత సాధించింది. అదే సమయంలో 3 వరుస మ్యాచుల్లో ఓడిపోయిన నేపాల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆదివారం ముంబై వేదికగా విండీస్, నేపాల్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన కరేబియన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. వెస్టిండీస్ బౌలర్ జాసన్ హోల్డర్ (4/27) అద్భుత బౌలింగ్‌తో నేపాల్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా, దీపేంద్ర సింగ్ ఐరీ (47 బంతుల్లో 58) ఒంటరి పోరాటం చేసి అర్ధ సెంచరీ చేశాడు.

చివర్లో సోంపాల్ కమీ (15 బంతుల్లో 26) వేగంగా ఆడటంతో నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులు చేయగలిగింది. అనంతరం 134 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌కు ఓపెనర్ బ్రాండన్ కింగ్ (22) మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అతను ఔటైన తర్వాత క్రీజులోకి షిమ్రాన్ హెట్‌మెయర్ (32 బంతుల్లో 46 నాటౌట్), మరో ఓపెనర్, కెప్టెన్ షాయ్ హోప్ (44 బంతుల్లో 61 నాటౌట్)తో కలిసి విధ్వంసం సృష్టించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు అజేయంగా 91 పరుగులు జోడించడంతో విండీస్ 15.2 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయిన లక్ష్యాన్ని ఛేదించింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమితో నేపాల్‌ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird