
నిజామాబాద్ లో ప్రతిపక్షంలో ఉంటాం
వార్డు సభ్యులు, కార్పొరేటర్లను ఎత్తుకెళ్తే తీవ్ర పరిణామాలు
ముద్ర, నిజామాబాద్ :
నిజామాబాద్ కార్పొరేషన్ 28 డివిజన్లలో విజయం సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన బీజేపీ ప్రతిపక్షంలో స్ధానిక ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో తాము కాంగ్రెస్, బీఆర్ఎస్ ను డామినేట్ చేశామన్నారు. తన పార్లమెంట్ పరిధిలో మిగిలిన మున్సిపాలిటీల్లోనూ బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు సాధించామన్నారు. శనివారం నిజామాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలాగైనా కాదా అని కాంగ్రెస్ గెలిచాం. రాష్ట్రంలో కాంగ్రెస్ బలమైన ప్రభుత్వమేమి కాదన్న అరవింద్.. సీఎం రేవంత్ రెడ్డి బలమైన పొజిషన్‌లో లేరన్నారు. సీఎంను ప్రజలు ఛీ కొడ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ శాఖను తన స్వార్ధ రాజకీయాలకు ఉపయోగించుకుంటోందని ఎంపీ. పోలీసులు తనపై కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. వాస్తవం తానే పోలీసులపై కేసు పెట్టాలన్నారు. ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను పోలింగ్ బూత్‌ల నుంచి బయటికి పంపిన పోలీసులు.. కాంగ్రెస్‌కు ఓటు వేయాలని చెప్పారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఎత్తుకెళ్లడానికి కాంగ్రెస్ వారికి సహయం ప్రచారంలో ఉంది. పోలీసులు శాంతి భద్రతలు పరిరక్షిస్తారా లేక బ్రేక్ చేస్తారా అని ప్రశ్నించారు. రాజకీయాలను భ్రష్టుపట్టించారనే కేసీఆర్‌ను ప్రజలు ఓడించారని ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్లీ అదే పేరు దుయ్యబట్టారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని కార్పొరేటర్లు ఎవరికి మద్దతు ఇవ్వాలనేది వారి వారి పార్టీలు నిర్ణయించుకుంటాయన్నారు.