Home Latest News పోలీసు సైరన్‌తో వాహనం….వ్యక్తిని ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన పోకిరీలు | హైదరాబాద్| కుషాయిగూడ పోలీస్ స్టేషన్| సతీష్| మహేష్| తరుణ్| వినియోగదారుల ఫోరం| కుషాయిగూడ పోలీస్| సీఎం రేవంత్ రెడ్డి| తెలంగాణ పోలీస్| సీపీ సజ్జనార్| డీజీపీ శివధర్ రెడ్డి – Andhra Waves

పోలీసు సైరన్‌తో వాహనం….వ్యక్తిని ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన పోకిరీలు | హైదరాబాద్| కుషాయిగూడ పోలీస్ స్టేషన్| సతీష్| మహేష్| తరుణ్| వినియోగదారుల ఫోరం| కుషాయిగూడ పోలీస్| సీఎం రేవంత్ రెడ్డి| తెలంగాణ పోలీస్| సీపీ సజ్జనార్| డీజీపీ శివధర్ రెడ్డి – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణమైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.. ఓ వ్యక్తిని కారుతో ఢీకొట్టి దాదాపు కిలోమీటర్ మేర రోడ్డుపై ఈడ్చుకెళ్లిన దారుణ ఘటనలో పోలీసులు వేగంగా స్పందించిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో కొన్ని గంటల్లోనే పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

వివరాల ప్రకారం సతీష్‌ అనే వ్యక్తి ఆఫీస్ పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో బొలెరో వాహనంలో వచ్చిన మహేశ్‌, తరుణ్‌ అతడికి కారణం ఢీ కొట్టారు. అనంతరం సతీష్ పోకిరి యువకుల వాహనాన్ని ఫాలో అయ్యి అడ్డుకున్నాడు.. కారు దిగి సతీష్ మాట్లాడుతుండగా పోకిరి యువకులు ఆనందం అతన్ని ఢీ కొట్టి…. వాహనాన్ని ఆపకుండా ముందుకు దూసుకెళ్లడంతో సతీష్ వాహనానికి చిక్కుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లినట్లు పేర్కొన్నారు. దాదాపు కిలోమీటర్ దూరం వరకు ఈ దారుణం కొనసాగింది.

ఈ ఘటనలో సతీశ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతని కాలు విరిగిపోవడంతో పాటు ప్రైవేట్ భాగాలకు కూడా తీవ్రంగా గాయాలు కావడంతో విషమంగా మారింది. స్థానికులు స్పందించి అతడిని సమీప ఆసుపత్రికి తరలించిన వెంటనే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ప్రత్యేక నిఘా ఉంచారు. సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించిన పోలీసులు వాహనాన్ని గుర్తించి నిందితులు మహేశ్‌, తరుణ్‌లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు “తెలంగాణ కన్స్యూ మర్‌ఫోరం” పేరుతో తిరు గుతూ స్థానికంగా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దారుణ ఘటనతో కుషాయిగూడ ప్రాంతంలో భయాందోళనలు నెలకొనాయి. ప్రజల మధ్య భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. రోడ్లపై దౌర్జన్యంగా వ్యవహరించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు. నిందితులపై హత్యాయత్నం తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి మరింత లోతుగా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird