తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో వాస్తవ వేదిక 12వ సంచిక గురువారం (ఫిబ్రవరి 12) విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ అర్ధవంతమైన చర్చలు జరిపారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కోసం జగన్ హయాంలో సరఫరా అయినది అసలు నెయ్యే కాదని డోలేంద్ర ప్రసాద్ కుండ బద్దలు కొట్టారు.
పామాయిల్‌తో పాటు రసాయనాలు కలిపిన నూనె సరఫరా చేశారన్నారు. ఇప్పుడు వైసీపీ నాయకులు తెలివిగా నెయ్యిలో కల్తీ లేదని వాదిస్తూ ప్రజలను తొప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్న దొంగే దొంగ దొంగ అని అరుస్తున్న చందంగా ఉందని డోలేంద్ర ప్రసాద్ అన్నారు. జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి హైకోర్టును సుప్రీంకోర్టులో వదిలి సీబీఐ విచారణ కోరడం అలాంటిదేనని కంఠంనేని రవిశంకర్ అన్నారు. అపచారం చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు బుకాయిస్తున్నారు. ఈ దశలో కంఠంనేని రవి శంకర్ గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుమలకు ఏడు కొండలు ఎందుకు రెండు కొండలు చాలు అన్న తర్వాత వైఎస్ ఏకంగా ఏడు కొండలు కాదు రెండు కొండలే అంటూ జీవో ఇచ్చిన గుర్తింపు.. వైఎస్ఆర్ కుటుంబం తిరుమలపై కక్ష కట్టిందా? అన్న ప్రశ్న సంధించారు. ఈ సంచికలో ఇంకా పింక్ డైమండ్ అన్న రమణదీక్షితులు వ్యవహారంపై కూడా చర్చకు వచ్చింది.
మొత్తంగా హయాంలో తిరుమల లడ్డూ తయారీలో అసలు నెయ్యిని వాడలేదనీ, నెయ్యిలా కనిపించేందుకు, పూసపూసల నెయ్యి అనిపించేలా నూనెలో రసాయనాలు కలిపి అందించినట్లు వైసీపీ డోలేంద్ర ప్రసాద్ తెలిపారు. దీనివల్ల తిరుమల లడ్డూ ప్రసాదం మూడు నాలుగు రోజులలోనే బూజు పట్టేవన్నారు. ఈ విషయంలో తెలుగుదేశం డిఫెన్స్‌లో పడటానికి, ల్యాబ్ రిపోర్టులు పూర్తిగా అధ్యయనం చేయకుండా చంద్రబాబు నెయ్యిలో జంతువుల కొవ్వు కల్తీ అని ప్రకటించడమేనన్నారు. ఇక నుంచైనా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి’అనడం మాని కల్తీ నూనె లేదా రసాయనాల మిశ్రమం అని పిలవాలని డోలేంద్ర ప్రసాద్ సూచించారు. ఎందుకంటే అసలు నెయ్యే లేనప్పుడు కల్తీ నెయ్యి అని ఎలా అనగలం అన్నారు.
ఇక తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో ఇంతటి అపచారం జరిగితే చిన్న జీయర్ స్వామి మతాధిపతులు, మఠాధిపతులు, హిందూ సంస్థలు ఎందుకు మౌనం వహిస్తున్నాయి. దర్యాప్తు సంస్థల విచారణలు, రాజకీయ ఆరోపణలు కాకుండా మతాధిపతులతో కూడిన కమిటీ విచారణ చేస్తే ప్రజలకు నమ్మకం కలుగుతుందని డోలేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. దేవుడికి అపచారం చేసిన వారు ఎవరూ బాగుపడలేదు. జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్త హోమం నిర్వహించాలని, జగన్ తన హయాంలో జరిగిన తప్పుకు బహిరంగ క్షమాపణ కోరాలని డోలేంద్ర ప్రసాద్ అన్నారు.
వాస్తవ వేదిక పూర్తి చర్చను తెలుగువన్ యూట్యూబ్ ఛానెల్‌లో కనిపిస్తుంది
