తనను తాను మెరుగుపరుచుకోవడానికీ, క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యలను తెలుసుకుని వాటి విషయంలో మరింత వేగంగా స్పందించడానికి ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అందుకోసం ఆయన వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త సంప్రదాయానికీ శ్రీకారం చుడతారు. ఇప్పుడు కూడా ఆయన ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయనో వినూత్న శ్రీకారం చుట్టారు. బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నన్ని రోజులూ నారా లోకేష్ రోజుకొక పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి కుటుంబ సభ్యులతో డిన్నీర్ మీటింగ్ లు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఈ డిన్నర్ మీటింగ్ ల ద్వారా ప్రజాప్రతినిధులతో మరింత మమేకం కావడమే కాకుండా, వారి నియోజకవర్గాలలోని ప్రజా వారి సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి మరింత వేగంగా కార్యాచరణ చేపట్టే అవకాశం ఉంటుంది.
అలాగే నేతల యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు వారి వారి నియోజకవర్గాల సమస్యలు, అభివృద్ధిపై చర్చించి పరిష్కార మార్గాలను కనుగొనడమే లక్ష్యంగా ఈ డిన్నర్ మీటింగ్ లు ఏర్పాటు చేసినట్లు లోకేష్ చెప్పారు. ఈ డిన్నర్ భేటీలు ఉండవల్లిలోని ఉండవల్లిలోని క్యాంపు జరుగుతాయి. ఈ భేటీలో ప్రజాప్రతినిధులతో మమేకమవుతూ పరిపాలనలో సమన్వయం పెంచేందుకు ఎంతగానో దోహదపడతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
