Home Latest News ఫోన్ ట్యాపింగ్ ఇప్పటికీ జరుగుతుంది…మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు | ఫోన్ ట్యాపింగ్ ఇప్పటికీ జరుగుతుంది| మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి| ఫోన్ ట్యాపింగ్ కేసు| కేసీఆర్| కేటీఆర్| BRS పార్టీ| సీఎం రేవంత్ రెడ్డి| కాంగ్రెస్ పార్టీ| ప్రభాకర్ రావు| | డీజీపీ శివధర్ రెడ్డి| సీపీ సజ్జనార్| హైదరాబాద్ పోలీసులు – Andhra Waves

ఫోన్ ట్యాపింగ్ ఇప్పటికీ జరుగుతుంది…మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు | ఫోన్ ట్యాపింగ్ ఇప్పటికీ జరుగుతుంది| మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి| ఫోన్ ట్యాపింగ్ కేసు| కేసీఆర్| కేటీఆర్| BRS పార్టీ| సీఎం రేవంత్ రెడ్డి| కాంగ్రెస్ పార్టీ| ప్రభాకర్ రావు| | డీజీపీ శివధర్ రెడ్డి| సీపీ సజ్జనార్| హైదరాబాద్ పోలీసులు – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


ఫోన్ ట్యాపింగ్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ ఇప్పటికీ జరుగుతూనే ఉంది, గత ప్రభుత్వానికి చెందిన బీఆర్‌ఎస్ పెద్దల వద్ద ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన పరికరాలు ఉన్నాయనే బలమైన అనుమానాలు ఉన్నాయి. ఇటీవల కార్పొరేటర్లతో నిర్వహించిన కాన్ఫరెన్స్ కాల్‌ను కూడా ట్యాప్ చేసి విన్నారన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.

తాను కాన్ఫరెన్స్ కాల్‌లో మాట్లాడిన అంశాలు బయటికి రావడం చూసిన తర్వాతే ఈ అనుమానాలు మరింత బలపడ్డాయని చెప్పారు. “మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా అంతర్గత సమాచారం బయటికి ఎలా వెళ్తుందో అనే సందేహం ఎప్పటి నుంచో ఉందని మంత్రి చెప్పారు. ఇప్పుడు చూస్తుంటే, మేము మాట్లాడుతున్న కాన్ఫరెన్స్ కాల్స్ కూడా ఎలా లీక్ అవుతున్నాయి?” అంటూ మంత్రి ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

అక్రమంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని. ఈ వ్యవహారంలో ఎవరు ఎంతటి రాజకీయ స్థాయిలో ఉన్నా వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ మామిడి తోటలో కూర్చొని ఫోన్ ట్యాపింగ్ చేస్తూ మా ఫోన్లు వింటున్నాడేమో అనే అనుమానం కూడా ఉంది. ఆయన వద్ద ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఉన్నాయని అనిపిస్తోంది”

అంటూ. ఈ అంశంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతామని, కేసీఆర్ వద్ద ఉన్నట్లు అనుమానిస్తున్న ట్యాపింగ్ ఎక్విప్‌మెంట్‌ను బయటపెడతామని మంత్రి ప్రకటించారు. ఫోన్ ట్యాపింగ్ వంటి అక్రమ చర్యలు ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పుగా మారతాయి, ప్రజల గోప్యతను భంగం చేసే ఇలాంటి చర్యలను సహించబోమని మంత్రి వివరించారు.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird