Home Latest News దిగి వచ్చిన పాక్… పీసీబీకి శ్రీలంక అధ్యక్షుడి థ్యాంక్స్ | షెహబాజ్ షరీఫ్| శ్రీలంక| పాకిస్తాన్| T20 వరల్డ్ కప్| భారతదేశం| క్రికెట్| కొలంబో| ప్రెసిడెంట్ దిసానాయక్| పాకిస్థాన్ ప్రధాని| ఇండియా పాకిస్థాన్ మ్యాచ్| BCCI – Andhra Waves

దిగి వచ్చిన పాక్… పీసీబీకి శ్రీలంక అధ్యక్షుడి థ్యాంక్స్ | షెహబాజ్ షరీఫ్| శ్రీలంక| పాకిస్తాన్| T20 వరల్డ్ కప్| భారతదేశం| క్రికెట్| కొలంబో| ప్రెసిడెంట్ దిసానాయక్| పాకిస్థాన్ ప్రధాని| ఇండియా పాకిస్థాన్ మ్యాచ్| BCCI – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


బంగ్లాదేశ్‌కు మద్దతుగా టీ20 ప్రపంచ కప్ గ్రూప్ స్టేజిలో భారత్‌తో మ్యాచ్ ఆడబోమని బెట్టు చేసిన పాక్ చివరికి మెట్టు దిగొచ్చింది. ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్-పాక్ జట్లు తలపడనున్నాయి. ఈ మెగా టోర్నీకి భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో.. పాక్ మ్యాచ్ ఆడకపోతే తమకు తీవ్ర నష్టం జరుగుతుందని శ్రీలంక క్రికెట్ బోర్డు.. పీసీబీని అభ్యర్థించింది. తమ అభ్యర్థనతో పాక్ నిర్ణయం మార్చుకున్నందుకు ఆ దేశ అధ్యక్షుడు అనూర కుమార దిసనాయకే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పాక్ జట్టుకు అనుమతి ఇచ్చిన థాంక్యూ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ అని దిసనాయకే తన పోస్టులో పేర్కొన్నాడు, టీ20 క్రికెట్ ప్రపంచ కప్‌లో భాగంగా.. షెడ్యూల్ ప్రకారం కొలంబోలో జరగనున్న-పాక్ మ్యాచ్ కోసం భారత్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నమెంట్‌కు సహ అతిథ్య దేశమైన శ్రీలంక.. ఐసీసీ ప్రయత్నాలకు కూడా ధన్యవాదాలు తెలిపింది. 1996 ప్రపంచ కప్ సమయంలో భద్రతా కారణాల వల్ల ఇతర దేశాలు తమ దేశంలో ఆడటానికి దూరంగా ఉన్నప్పుడు భారత్-పాకిస్థాన్ జట్లు కొలంబోలో ఆడటం ద్వారా చూపిన సంఘీభావాన్ని శ్రీలంక ఎప్పటికీ మర్చిపోలేని శ్రీలంక అధ్యక్షుడు చెప్పారు.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird