రంగారెడ్డి జిల్లా మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. రూ. 50 వేల లంచం తీసుకుంటూ ఎస్సై వినయ్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ చీటింగ్ కేసులో జైలు నుంచి తప్పించేందుకు ఎస్సై రూ.50 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు.
వివరాల ప్రకారం…
ఓదారుడికి సంబంధించిన కేసులో తన సహకారం అందిస్తానని చెప్పిన ఎస్‌ఐ వినయ్, ఇందుకు ప్రతిఫలంగా రూ. 50,000 వేల రూపాయలు లంచం ఇవ్వడానికి డిమాండ్ చేశాడు. అంత పెద్ద మొత్తం ఇచ్చుకునేంత స్తోమత తనకు లేదని బాధితుడు మొరాపెట్టుకున్నాడు. అయినా కూడా లంచం ఎస్సై డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఫిర్యాదును స్వీకరించిన ఏసీబీ అధికారులు, ప్రాథమిక విచారణ అనంతరం వినయ్‌పై వలపన్నేందుకు నిర్ణయించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈసీబీ అధికారులు ఫిర్యాదుదారుడిని మొత్తం లంచం డబ్బులు ఇచ్చి ఎస్‌ఐ వినయ్ వద్దకు పంపించారు.
వినయ్ నగదును స్వీకరిస్తున్న క్షణంలోనే అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి రూ.50,000 లంచం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వినయ్‌ను అదుపులోకి తీసుకుని, ఏసీబీ కార్యాల యానికి తరలించి విచారణ జరిగింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఉద్రిక్త వాతావరణం. స్టేషన్ సిబ్బందితో పాటు స్థానికులలోనూ ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రజలతో నిత్యం మమేకమై ఉండాల్సిన పోలీస్ అధికారి, అవినీతికి పాల్పడటం పట్ల పౌరులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడితే ఎలాంటి ఉపేక్ష ఉండదని, కఠిన చర్యలు తప్పవని ఏసీబీ అధికారులు తెలిపారు. వినయ్‌పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి గతంలో నిర్వహించిన విధులు, ఇతర ఫిర్యాదులు ఉన్నాయా అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది
