Home సినిమా మోక్షజ్ఞ సినిమా పరిస్థితి ఏంటి.. అనిల్ రావిపూడితో చేస్తే ఎలా ఉంటుంది! – Andhra Waves

మోక్షజ్ఞ సినిమా పరిస్థితి ఏంటి.. అనిల్ రావిపూడితో చేస్తే ఎలా ఉంటుంది! – Andhra Waves

by
0 comments
మోక్షజ్ఞ సినిమా పరిస్థితి ఏంటి.. అనిల్ రావిపూడితో చేస్తే ఎలా ఉంటుంది!




-నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఎంత వరకు వచ్చింది
-ఫ్యాన్స్ ఏమంటున్నారు
-వాళ్ళు ఇస్తున్న సలహాలు ఏంటి!
-అనిల్ రావిపూడి ఏమంటాడు

గాడ్ ఆఫ్ మాసెస్ అనే టైటిల్ తనకి ఒక రేంజ్, వైబ్రేషన్ ఉండాలని నట సింహం బాలకృష్ణ(బాలకృష్ణ)దగ్గరకి తనతంట తానుగా వచ్చి చేరిందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతలా తన సింహపు గర్జన లాంటి డైలాగ్స్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసాడు. ఫ్యామిలీ, సెంటిమెంట్, జానపద, పౌరాణిక, ఫిక్షన్ చిత్రాలలో కూడా సుదీర్ఘ కాలం నుంచి చేస్తు తెలుగు చిత్ర పరిశ్రమలో డిక్షనరీ లో ఎక్స్‌పైరీ డేట్‌ని డిలెట్ చేసే పని కల్పించాడు. మరి ఇంత కీర్తిని గడించిన బాలయ్య నుంచి అభిమానులు కోరుకునే అంశాల్లో వారసుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం.

వాళ్ళ ఆశలకి తగ్గట్టుగానే కొన్ని నెలల క్రితం హనుమన్(హనుమాన్)ఫేమ్ ప్రశాంత్ వర్మ(Prashanth varma)డైరెక్షన్ లో మోక్షజ్ఞ(Mokshagna)డెబ్యూ మూవీకి రంగం సిద్ధమయ్యింది. రెండు రోజుల్లో అధికారకంగా పూజ కార్యక్రమాలు ప్రారంభం అవుతుండగా వాయిదా పడింది. ప్రశాంత్ వర్మ ప్లేస్ లో వేరే దర్శకుడు ఉంటాడనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ప్రస్తుతం ఆ సినిమా ఊసునే ఎవరు ఎత్తటం లేదు. కనీసం రూమర్ గా అయినా మోక్షజ్ఞ డెబ్యూ మూవీ న్యూస్ రావడం లేదు. దీంతో అభిమానులు మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి సంబంధించిన డీటెయిల్స్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తూ వస్తున్నారు.

ఇది కూడా చదవండి: పిడిగుద్దులుతో చితకబాదిన సాయి ధన్సిక.. మందు తాగి అతి చేస్తే ఇలాగే ఉంటాడు

ఇంకొంత మంది అభిమానులు అయితే సోషల్ మీడియా వేదికగా నటులు అనిల్ రావిపూడి వెంటనే సినిమా చేయడానికి ప్రస్థుతానికి పెద్ద హీరోలు ఎవరు ఖాళీగా లేరు. దీంతో మోక్షజ్ఞ తో అనిల్ రావిపూడి(anil Ravipudi) యూత్ అండ్ ఫ్యామిలీ జోనర్ లో సినిమా చేస్తే సూపర్ గా ఉంటుంది. అనిల్ రావిపూడి సినీ దీక్షనరీలో కూడా తెలుగు సినిమా అధిపతి విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు మనవడు, బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ని పరిచయం చేసినట్లు రికార్డుగా చెబుతున్నారు. మరి అభిమానుల గాలి అనిల్ రావిపూడి, బాలకృష్ణ వైపు మళ్లుతుందేమో చూడాలి. బాలకృష్ణ,అనిల్ కాంబోలో భగవంత్ కేసరి వచ్చి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird