Home Latest News హాస్టల్ విద్యార్ధుల అస్వస్థతపై సీఎం చంద్రబాబు సమీక్ష | వరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్‌లో విద్యార్థులకు అస్వస్థత| రంపచోడవరం| సీఎం చంద్రబాబు| మారేడుమిల్లి| వరపల్లి| పోలవరం జిల్లా – Andhra Waves

హాస్టల్ విద్యార్ధుల అస్వస్థతపై సీఎం చంద్రబాబు సమీక్ష | వరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్‌లో విద్యార్థులకు అస్వస్థత| రంపచోడవరం| సీఎం చంద్రబాబు| మారేడుమిల్లి| వరపల్లి| పోలవరం జిల్లా – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


పోలవరం జిల్లా రంపచోడవరంలోని దేవరపల్లి ఆశ్రమం బాలుర హాస్టల్‌లో విద్యార్ధుల అస్వస్థత ఘటనపై సీఎం చంద్రబాబు సీఎంఓ అధికారులు, ఇతర అధికారులతో సమీక్షించారు. పోలవరం జిల్లా రంపచోడవరంలోని దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్‌లో 92 మంది విద్యార్ధులకు వాంతులు, కడుపునొప్పి, జ్వరం, డయేరియా లక్షణాలు కనిపించడంతో వారిని హుటాహుటిన మారేడుమిల్లి, రంపచోడవరం ఏరియా ఆస్పత్రులకు తరలించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

నిన్న ఉదయం అల్పాహారం తీసుకున్న తరువాత విద్యార్ధులకు కడుపు నొప్పి, వాంతులు రావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు తెలిపారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం కుదుటపడిందని తెలిపారు. వెంటనే హాస్టల్ తనిఖీకి వెళ్లి అక్కడి పరిస్థితులను కూడా అధ్యయనం చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలియచేశారు. హాస్టల్‌లోని మిగిలిన విద్యార్ధులకు కూడా ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి డయేరియా లక్షణాలు ఉన్నవారికి చికిత్స అందించినట్లు వివరించారు.

ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు….ఆహార పదార్ధాల, నీటి నమూనాలు కూడా సేకరించామని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు జైంట్ ఇనస్పెక్షన్ కమిటీని కూడా నియమించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ…రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్ధుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. వైద్య విద్యార్ధుల ఆరోగ్య పరిస్థితిపై తనకు నివేదించినట్లు. ఘటనపై రేపటి లోగా పూర్తి నివేదికను తనకు అందజేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. కారకులపై శాఖాపరమైన చర్యలతో పాటు…..అవసరాన్ని బట్టి క్రిమినల్ చర్యలు కూడా అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird