Home సినిమా ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ – Andhra Waves

ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ – Andhra Waves

by
0 comments
ఘనంగా 'అమరావతికి ఆహ్వానం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్



శివ కంఠంనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తేర్, సుప్రీత, హరీష్ ప్రదానం తారాగణంగా తెరకెక్కించిన సినిమా “అమరావతికి ఆహ్వానం” (అమరావతికి ఆహ్వానం). ఈ మూవీలో సీనియ‌ర్ న‌టులు అశోక్ కుమార్‌, భద్ర‌మ్‌, జెమిని సురేష్, నాగేంద్ర ప్ర‌సాద్ కీల‌క పాత్ర‌లు పోషించారు. డైరెక్టర్ జీవీకే ఈ మూవీని ప్రదర్శించారు. ప్రముఖ నిర్మాత ముప్పా వెంకయ్య చౌదరి నిర్మాణ సారథ్యంలో జి. రాంబాబు యాదవ్ స‌మ‌ర్ప‌ణ‌లో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేన‌ర్‌పై కేఎస్ శంక‌ర్‌రావు, ఆర్ వెంక‌టేశ్వ‌ర రావు ఈ చిత్రాన్ని నిర్మించారు.

“అమరావతికి ఆహ్వానం” సినిమా ఈ 13న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శనివారం హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్య క్ర‌మంలో ముఖ్య అతిధులుగా ప్ర‌ముఖ న‌టులు, నిర్మాత ముర‌ళి మోహ‌న్‌గారు, యంగ్ హీరో అశ్విన్ బాబు హాజ‌ర‌య్యారు. ఈ కార్యక్రమములో…

ప్రముఖ నటులు, నిర్మాత మురళీ మోహన్ మాట్లాడుతూ.. “తెలుగు సినిమా ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. మనం ఆస్కార్ రేంజ్ సినిమాలు చేస్తున్నాం. అయితే అలాంటి భారీ చిత్రాలతో పాటు చిన్న సినిమాలు కూడా పరిశ్రమకు అవసరం. అలా రెగ్యులర్‌గా చిన్న మూవీలు నిర్మించే పరిశ్రమలో అందరికీ ఉపాధి కల్పిస్తున్న మా మిత్రులు శివ కంఠంనేని, వెంకటేశ్వరరావు… నిర్మించిన “అమరావతికి ఆహ్వానం” సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అన్నారు.

హీరో అశ్ బాబు మాట్లాడుతూ “అమరావతికి ఆహ్వానం సినిమా ట్రైలర్ బాగుంది. ట్రైలర్ సినిమా చూడాలనే ఆసక్తిని దర్శకుడు క్రియేట్ చేశారు. ముగ్గురు హీరోయిన్స్ తో ఇలాంటి మూవీ చేయడం సులువైన పని కాదు. మేము రాజు గారి గదితోనే ఇలాంటి చిన్న బడ్జెట్ చేశాం. ఆ మూవీని మీరంతా ఆదరించారు. ఈ సినిమా కూడా సక్సెస్ కావాలి. అన్నారు.

నిర్మాత ఆర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ “ఇవాళ అమరావతికి ఎంతో ఖ్యాతి వస్తోంది. అలాంటి నగరం పేరుతో మేము హారర్ మూవీ చేశాం. మా హీరోయిన్స్ తమ అందంతో పాటు నటనతో మీ అందరినీ ఆకట్టుకుంటోంది. మాకు ఈ చిత్రంతో సక్సెస్ దక్కుతుందనే నమ్మకం ఉంది. ఇప్పుడు ట్రైలర్ చూసి పెద్ద హిట్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నాం. మా హీరో శివ గారికి ఇతర టీం అందరికీ గుడ్ మూవీస్ చెప్పాలి.” అన్నారు.

జీవీకే మాట్లాడుతూ “అమరావతికి ఆహ్వానం అనే టైటిల్ చూసి ఇదే పొలిటికల్ మూవీ అనుకుంటున్నారు. కాదు ఇందులో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. రెండున్నర గంటలు మిమ్మల్ని ఎంటర్ టైన్ చేసే హారర్ థ్రిల్లర్ మూవీ ఇది. ఎవరు చెప్పే వ్యూస్ నమ్మకండి. మా హీరోయిన్స్ ఎస్తేర్, ధన్య, సుప్రీత ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే శివ గారి డెడికేషన్ చూసి ఆశ్చర్యపోయాను. అన్నారు.

హీరో శివకంఠంనేని మాట్లాడుతూ “అమరావతికి ఆహ్వానం సినిమా బాగా వచ్చింది. ఫస్ట్ కాపీ చూసుకున్నాం. క్వాలిటీస్ గా రీచ్ అయ్యేలా ప్రమోట్ చేస్తున్నాం. ఎంటర్ టైన్ మెంట్ కు మేము గ్యారెంటీ ఇస్తున్నాం. రెండున్నర గంటలు మూవీని ఎంజాయ్ చేస్తారు. చిత్రాలకు ప్రేక్షకులు రావాలి. అన్నారు.

హీరోయిన్ సుప్రీత మాట్లాడుతూ “అమరావతికి ఆహ్వానం సినిమాలో నేనొక ఇంపార్టెంట్ రోల్ చేశాను. నేను బయట ఎంత అల్లరిగా, సరదాగా ఉంటానో ఈ సినిమాలోనూ అలాంటి క్యారెక్టర్ చేశాను. ఈ పాత్రకు నేను బాగా రిలేట్ అయ్యాను. ఈ చిత్రంలో నటిస్తున్నప్పుడు ధన్య, ఎస్తేర్ గారు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. శివ గారితో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది.” అన్నారు.

హీరోయిన్ ఎస్తేర్ మాట్లాడుతూ “మంచి కథతో చేసిన చిత్రమిది. నేను కూడా మీతో పాటు ఈ నెల 13న థియేటర్స్‌లో సినిమా చూడబోతున్నా. మా అందరికీ ఎగ్జైటింగ్‌గా ఉంది. మూవీ తప్పకుండా మీకు నచ్చుతుందని నమ్ముతున్నాను. నేను బాగా నటించాలనుందని నమ్మి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ థ్యాంక్స్. అమరావతికి ఆహ్వానం సినిమా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను.” అన్నారు.

హీరోయిన్ ధన్య మాట్లాడుతూ “మీ కళ్లు బాగుంటాయి, రొమాంటిక్ మూవీస్ చేయండి, ట్రెడిషనల్ ఫ్యామిలీ మూవీస్ చేయండి అని అంటుంటారు కానీ మా డైరెక్టర్ జీవీకే మీ కళ్లు బాగుంటాయి. మీరంతా థియేటర్స్ కు వచ్చి చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.

డీఓపీ జె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ “అమరావతికి ఆహ్వానం అంటే ఇది ఏపీలోని అమరావతి అనుకుంటున్నారు. ఇది నలుగురు ఏంజిల్స్ ఉంటే అమరావతి. వాళ్లు తమ అందంతో ఆకట్టుకుంటారు, అలాగే డెవిల్స్ భయపడతారు” అన్నారు.

మ్యూజిక్ పద్మనాభ్ భరద్వాజ్ మాట్లాడుతూ “మా మూవీలో మంచి మ్యూజిక్ చేసే అవకాశం వచ్చింది. ఈ సాంగ్ మీకు నచ్చుతుందనే నమ్ముతున్నాను. బీజీఎం కూడా నాకు మంచి పేరు తెస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ జీవీకే గారికి, ప్రొడ్యూసర్ వెంకటేశ్వరావు గారికి థ్యాంక్స్.” అన్నారు.

నటుడు జెమినీ సురేష్ మాట్లాడుతూ “ఆదిపర్వం సినిమాలో శివ గారితో కలిసి వర్క్ చేశాను. ఈ సినిమాలో ఒక పిచ్చివాడి క్యారెక్టర్ కు నేనే కావాలని మరీ అవకాశం ఇచ్చారు. మనం రెగ్యులర్ క్యారెక్టర్స్ ఎన్నో చేస్తున్నాం కానీ ఈ క్యారెక్టర్ లో నటించడం డిఫరెంట్ ఎక్సిపీరియన్స్ ఇచ్చింది.” అన్నారు.

నటుడు రఘుబాబు మాట్లాడుతూ “నాకు ప్రొడ్యూసర్స్ శివ కంఠంనేని, వెంకటేశ్వరరావు మంచి మిత్రులు. వారు నిర్మించిన చిత్రాల్లో నటించాను. ఈ దర్శకుడు జీవీకే బాగా తెరకెక్కించాడని నిర్మాతలు చెప్పారు. ఆది తర్వాత వినాయక్ గారికి ఎంత పేరొచ్చిందో ఈ సినిమా తర్వాత డైరెక్టర్ జీవితానికి అంత గుర్తింపు రావాలి. ఈ సినిమాలో ముగ్గురు అందమైన ప్రతిభ గల హీరోయిన్‌గా నటించారు. అన్నారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird