Home Latest News ఫోరెన్సిక్ లియాబ్ అగ్నిప్రమాదంపై ముమ్మర దర్యాప్తు | ఫోరెన్సిక్ ల్యాబ్ ఫైర్|హైదరాబాద్ అగ్ని ప్రమాదం| CM Revanth Reddy|ఓటుకు నోటు కేసు|ఫోన్ ట్యాపింగ్ కేసు| BRS పార్టీ| నాంపల్లి| తెలంగాణ రాజకీయం| హైదరాబాద్| నాంపల్లి| షార్ట్ సర్క్యూట్| శ్వేత డీఐజీ| శిల్పవల్లి డీసీపీ| తెలంగాణ – Andhra Waves

ఫోరెన్సిక్ లియాబ్ అగ్నిప్రమాదంపై ముమ్మర దర్యాప్తు | ఫోరెన్సిక్ ల్యాబ్ ఫైర్|హైదరాబాద్ అగ్ని ప్రమాదం| CM Revanth Reddy|ఓటుకు నోటు కేసు|ఫోన్ ట్యాపింగ్ కేసు| BRS పార్టీ| నాంపల్లి| తెలంగాణ రాజకీయం| హైదరాబాద్| నాంపల్లి| షార్ట్ సర్క్యూట్| శ్వేత డీఐజీ| శిల్పవల్లి డీసీపీ| తెలంగాణ – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


హైదరాబాద్ నాబొంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యారేటరీలో ఇటీవల చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన కీలక ఆధారాల భద్రత దృష్ట్యా నాంపల్లి ఎఫ్‌ఎస్‌ఎల్‌ ల్యాబ్‌ను పోలీసులు పూర్తిగా సీజ్ చేశారు. ఘటనపై స్పష్టత కోసం ప్రత్యేక బృందాలతో విచారణ కొనసాగుతోంది.అగ్నిప్రమాదం జరిగిన ప్రథమ అంతస్తులోని కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌ను క్లూస్ టీమ్, స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) అధికారులు మరోసారి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జరిగిన సమయంలో ల్యాబ్‌లో ఎవరు ఉన్నారు, ఎలా మంటలు చెలరేగాయి అనే దానిపై ఎస్బీ అధికారులు ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు.

అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజ్‌ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు 40 కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, ల్యాప్‌టాప్‌లు, పెన్ డ్రైవ్‌లు పూర్తిగా దగ్ధమైనట్లు అధికారులు ప్రాథమికంగా పేర్కొన్నారు. కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌తో పాటు సర్వర్ రూమ్, హెచ్‌ఆర్డీ హాల్, ఫర్నిచర్ మరియు పలు కీలక పరికరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో ఉదయం 10:08 గంటల సమయంలో కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రాపర్టీ రూమ్‌లో భారీగా పొగ రావడం గమనించామని చెప్పారు. పొగ ఇతర గదులకు కూడా వ్యాపించినట్లు తెలిపారు. మా ఉద్యోగి సాయి కృష్ణ నుంచి అగ్నిప్రమాద సమాచారం అందగానే వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చినట్లు ఫిర్యాదులో వివరించారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఉదయం 10:30 సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి మధ్యాహ్నం 1:30 గంటలకు మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎఫ్‌ఎస్‌ఎల్ డైరెక్టర్ షికా గోయల్ స్వయంగా సంఘటనను పరిశీలించనున్నారు. అగ్నిప్రమాదంపై మధ్యాహ్నం 12 గంటలకు ఆమె మీడియా సమావేశం నిర్వహించి ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు. కీలక కేసులకు సంబంధించిన డిజిటల్ ఆధారాలు ల్యాబ్‌లో ఉండటంతో ఈ అగ్నిప్రమాదం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా? లేక మరేదైనా కారణాలున్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి నివేదిక రావాల్సి ఉంది

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird