అంబటి రాంబాబు జన్మతః కాపు అవునో కాదో తెలీదు. ఆయన మాటలు, చేష్టలను బట్టి చూస్తే ఎట్టి పరిస్థితుల్‌లోనూ కాపుగా భావించలేం. తాను కాలోనే పుట్టాన ని చెప్పుకునే రాంబాబు కాపుల గురించి, వారి జీవిత శైలి, వ్యక్తిత్వాల గురించి.. చాలా నీచంగా వ్యాఖ్యానించిన పరిస్థితి. ఇక తన ముగ్గురు కుమార్తెలకు ఇతర కులపు అల్లుళ్లను ఇచ్చి చేశారు. వారిలో డాక్టర్ గౌతం అనే ఒక అల్లడైతే.. అంబటి వంటి నీచుడ్ని తాను చూడలేదని అన్నారంటే పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు. అలాంటి అంబటిని ఒక కాపు టైగర్ గా అభివర్ణించారు జగన్. దీనితో వైసీపీలోని కాపు కులస్తులంగా కలసి.. అంబటికి సంఘీభావంగా ఛలో గుంటూరు అనే ఒక ర్యాలీ తీయడం మొదలు పెట్టారు.
ఇందుకు మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ నాయక్‌త్వం వహిస్తుండగా.. పార్టీలో కొందరు కాపు నాయకులు మాత్ర మే మద్ధతుగా నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే.. వీరంతా కలసి.. 200 కార్లు,, ఐదు వందల బైకులతో ఈ ర్యాలీ తీస్తున్నారు.ఇందులో ప్రత్యేకత ఏంటంటే.. ఈ ర్యాలీలో ఎలాంటి రాజకీయ జెండాలుగానీ, అజెండాలుగానీ లేవని వీరు అనడం హాస్యాస్పదంగా మారింది. అయితే ఇక్కడ కాపుల నుంచి ఎందరో ప్రముఖ రాజకీయ నాయకులున్నారు. కానీ, కేవలం వైసీపీ కాపు లీడర్లు మాత్రమే కలిసి వస్తోన్న ఈ ర్యాలీ కేవలం కాపు సామాజిక వర్గపరమైనది మాత్రమే అంటే ఎవరు మాత్రం నమ్ముతారు?
దానికి తోడు జగన్ వెనక ముద్రగడ పద్మనాభరెడ్డి వంటి వారు తప్ప మరే కాపులూ లేరు. అందరూ కూటమి వైపే ఉన్నారు. ఆ మాట కొస్తే ముద్రగడ కూతురు కూడా ఆయన వైపు లేరు. దానికి తోడు అంబటి వైపు ఏ సాధారణ కాపు సామాజిక వర్గపు వారు కూడా లేరు. అంబటి కాపులను బండ బూతులు తిట్టడం, ఆపై తన సామాజికవర్గం మీద తనకే నమ్మకం లేక తన పిల్లలకు కూడా ఇతర కులస్తులను ఇచ్చి పెళ్లి చేయడం వంటి అనేక అంశాలను బట్టి చూస్తే కాపులంతా అంబటిపై పీకలోతు కోపం పెంచుకుంటారు. కేవలం వైసీపీలోని ఆ కొందరు కాపులు తప్ప మరెవరూ లేరు. ఈ మాత్రం దానికి సంబంధించిన పార్టీలు రాజకీయాల్లేవనలో అర్ధమేంటన్న ప్రశ్న వినిపిస్తోంది.
