Home Latest News క్వాంటమ్ వ్యాలీ దేశానికే గేమ్ ఛేంజర్ : సీఎం చంద్రబాబు | అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన| క్వాంటం వ్యాలీ| అమరావతి| సీఎం చంద్రబాబు| కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ | IBM| TCS| L&T – Andhra Waves

క్వాంటమ్ వ్యాలీ దేశానికే గేమ్ ఛేంజర్ : సీఎం చంద్రబాబు | అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన| క్వాంటం వ్యాలీ| అమరావతి| సీఎం చంద్రబాబు| కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ | IBM| TCS| L&T – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


అమరావతిలో క్వాంటం వ్యాలీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన అనంతరం సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. ఈ రోజు అమరావతికే కాదు, ఆంధ్రప్రదేశ్‌కే కాదు, భారతదేశానికే ఒక చరిత్రాత్మక దినమని సీఎం.ఈ రోజు కేవలం క్వాంటం భవనాలకు మాత్రమే పునాది వేయడం లేదు… గ్లోబల్ క్వాంటం రెవల్యూషన్‌లో భాగమయ్యే సైన్స్ నిపుణులకు కూడా పునాది వేస్తున్నాం” అని ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక సామర్థ్యాలు వేగంగా పెరుగుతున్నాయని అనుకుంటున్నానని చంద్రబాబు అన్నారు.

గతంలో వచ్చిన వ్యవసాయ, పారిశ్రామిక విప్లవాలను భారత్ పూర్తిగా అందిపుచ్చుకోలేకపోయిందని, కానీ ఐటీ విప్లవంలో మాత్రం మనం ముందుడుగు వేశామని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చి హైటెక్ సిటీ ప్రారంభించడం ఓ గేమ్ చేంజర్‌గా మారి ఫలితాలు ఇస్తోందని అన్నారు.హైటెక్ సిటీ తరహాలోనే క్వాంటం టెక్నాలజీకి కేంద్రంగా అమరావతి మారుస్తాం. భారత్‌లో ఏర్పాటు చేస్తున్న తొలి అమరావతి క్వాంటం వ్యాలీని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించడం గర్వకారణం. ఇది కూడా ఒక విప్లవాత్మకంగా మారుతుంది” అని సీఎం అన్నారు.సాంకేతిక విప్లవాన్ని ఆచరించే ప్రధాని నరేంద్ర మోదీ బీఎస్‌ఎన్‌ 4జీ సేవలను అందుబాటులోకి తెచ్చారని, ఈ టెక్నాలజీ ద్వారా భవిష్యత్తులో 6జీ కమ్యూనికేషన్ కూడా సాధ్యమవుతుందని సీఎం తెలిపారు.

భారత్ నుంచి ఉత్పత్తులను ప్రపంచానికి అందించాలనే ఆకాంక్ష తనదని చెప్పారు.గతంలో తాను ఐటీ, సెల్‌ఫోన్ల గురించి మాట్లాడితే విమర్శించిన వారి పిల్లలే ఈ రోజు ఐటీ రంగంలో అమెరికాలో స్థిరపడ్డారని పేర్కొన్నారు. వచ్చే 30–40 ఏళ్లలో ఆచరణలోకి వచ్చేది తాను ఎప్పుడూ ఆలోచిస్తానని, దానికి అనుగుణంగానే ప్రణాళికలు ఉంటాయని చెప్పారు. టెక్నాలజీని అందిపుచ్చుకున్న దేశమే భవిష్యత్తులో అభివృద్ధి సాధిస్తుందని స్పష్టం చేశారు.ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటం వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీలకు కేంద్రంగా మార్చుతామని చెప్పారు. క్వాంటం డిజైన్స్, క్వాంటం ఉత్పత్తులు, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్‌కు అమరావతి కేంద్రంగా మారుతుందని.

డిఫెన్స్, హెల్త్‌కేర్, ఎనర్జీ, ఫైనాన్స్, క్లైమెట్ మోడలింగ్ వంటి రంగాల్లో అమరావతి క్వాంటం వ్యాలీలో పరిశోధనలు, ఆవిష్కరణలు జరుగుతాయని చంద్రబాబు అన్నారు.ఇప్పటివరకు ప్రపంచం అంతా అమెరికాలోని సిలికాన్ వ్యాలీ గురించి మాట్లాడింది. ఇక నుంచి క్వాంటం వ్యాలీ గురించి మాట్లాడతారు” అని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird