Home సినిమా శ్రీ చిదంబరం గారు అందరి హృదయాలకి హత్తుకుంటుంది: థ్యాంక్స్‌ మీట్‌లో టీం – Andhra Waves

శ్రీ చిదంబరం గారు అందరి హృదయాలకి హత్తుకుంటుంది: థ్యాంక్స్‌ మీట్‌లో టీం – Andhra Waves

by
0 comments
శ్రీ చిదంబరం గారు అందరి హృదయాలకి హత్తుకుంటుంది: థ్యాంక్స్‌ మీట్‌లో టీం



శ్రీమతి చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై చింతా వినీషా రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘శ్రీ చిదంబరం’ గారు(శ్రీ చిదంబరం గారు). వంశీ తుమ్మల(వంశీ తుమ్మల)సంధ్యా వశిష్ట(సంధ్యా వశిష్ట)జంటగా చెయ్యగా వినయ్ రత్నం దర్శకుడు. నిన్న ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం అందరి హృదయాలని హత్తుకుంటూ ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి. ఈసందర్భంగా చిత్ర యూనిట్‌ బ్లాక్‌బస్టర్‌ థ్యాంక్స్‌ మీట్‌ని ఏర్పాటు చేసింది.

దర్శకుడు వినయ్ రత్నం(వినయ్ రత్నం)మాట్లాడుతూ ”ఈ రోజు నా సక్సెస్‌కి కారణం నా టీమ్. ఈ వేదికపై ఈ రోజు నేను ఉండటానికి, సినిమా జనాల్లో రావడానికి ప్రధాన కారణం మా నిర్మాత గోపాల కృష్ణారెడ్డి గారు. ప్రీమియర్స్ దగ్గర నుంచే మంచి ఫీడ్‌బ్యాక్‌ వస్తుంది. ఇప్పుడు సినిమా విడుదలైన తరువాత అందరి నుంచి మంచి స్పందన వస్తోంది. కానీ ఇంకా ఆడియన్స్‌ నుంచి మరింత సపోర్ట్ కావాలి. ఈ సినిమా చూసి మలయాళం నుంచి అప్రిషియేషన్ వస్తుంది. ఇంతకు ముందు తెలుగు నుంచి మలయాళ వాళ్లకు ప్రశంసలు వచ్చేవి. ఇప్పుడు మలయాళం నుంచి ఫోన్లు వస్తున్నాయి. సినిమా చూసిన వాళ్లు మీ మౌత్‌టాక్‌తో మరింత మందికి చెప్పండి. ఈ సినిమా ఈరోజు ఇంత అప్రిషియేషన్ వస్తుందంటే మా టెక్నిషియన్స్ కూడా కారణం. వాళ్లకు నా కృతజ్క్షతలు’ అన్నారు.

చింతా గోపాల కృష్ణారెడ్డి మాట్లాడుతూ ”కొత్త టీమ్‌తో చేసిన సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌ చూస్తే నాకే ఆశ్చర్యమేసింది. సినిమా వాళ్లు బాగుందని ఫోన్ చేస్తున్నారు. కొత్త టీమ్ మొత్తం ఎంతో కష్టపడి చేశారు. ఈ విజయానికి కారణమైన అందరికి థ్యాంక్స్. నిర్మాతగా ఈ సినిమా కమర్షియల్‌గా కూడా హ్యపీగా ఉన్నాను. మా ప్రయత్నంలో ఉన్న నిజాయితీని పేర్కొన్నారు. త్వరలో మరో కొత్త దర్శకుడితో మరో సినిమాతో మీ ముందుకు వస్తాను’ అన్నారు.

వంశీ తుమ్మల మాట్లాడుతూ ” నా మొదటి సినిమాకే ఇంత మంచి అప్లాజ్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ స్టేజీ మీద ఉన్న ప్రతి ఒక్కరూ హీరోనే. నా పర్ఫార్మెన్స్‌కు మంచి స్పందన వస్తుంది. ఈ సినిమా ఫోటోగ్రఫీతో, సంగీతంతో మరో లెవల్‌కు వెళ్లిపోయింది. ఈ సంగీతాన్ని, విజువల్స్‌ని థియేటర్‌లో అందరూ ఎక్స్‌పీరియన్స్ చేయాలి. చిదంబరం ప్రపంచంలోకి వచ్చిన అందరూ కొత్త అనుభూతికి లోనవుతున్నారు’ అన్నారు.

సంధ్య వశిష్ట మాట్లాడుతూ ”శ్రీ చిదంబరం గారు’ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌. సినిమాకు అందరూ పాజిటివ్‌ రివ్యూస్‌ రాశారు. లీల పాత్ర అందరికి నచ్చుతున్నందుకు ఆనందంగా ఉంది. మా మా లాంటి కొత్త టాలెంట్‌ను మరింత మందిని పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను. ఇదొక క్లీన్‌ రీఫ్రెషింగ్‌ స్టోరీ తప్పకుండా అందరి హృదయాలకు హత్తుకుంటుంది.

ఈ హార్ట్‌ విన్నింగ్‌ బ్లాక్‌బస్టర్‌ థాంక్యూ మీట్‌లో బాలనటుడు శశికిరణ్, నిర్మాత రమణా రెడ్డి, డీఓపీ అక్షయ్‌ రామ్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ రవి, చందు పనిచేస్తున్నారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird