కర్నాటక వాసికి అనుకోని అదృష్టం కలిసొచ్చింది. అబుదాబిలో జరిగే బిగ్ టికెట్ లాటరీలో ఉడుపి జిల్లాలకు చెందిన 33 ఏళ్ల శాంతను శెట్టిగార్ జాక్ పాట్ కొట్టేశారు. లక్కీ డ్రాలో 20 మిలియన్ దిర్హామ్ లు అంటే భారత కరెన్సీలో దాదాపు 49 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. కర్ణాటకకు చెందిన ప్రవాస భారతీయుడు శాంతన్ శెట్టిగార్ మస్కట్ లో రిటైల్ రంగంలో పని చేస్తున్నారు.
అబుదాబిలోని బిగ్ టికెట్ రాఫెల్ డ్రాలో అతడికి 49 కోట్ల రూపాయల భారీ ప్రైజ్ లభించింది. మంగళవారం ఆన్లైన్లో ఈ లాటరీ ఫలితాలు వెల్లడయ్యాయి. ఉడుపి నిర్వహించే ఉద్యమర్కు చెందిన 33 ఏళ్ల శాంతను శెట్టిగర్.. ఈ వా డ్రాలో జాక్ పాట్‌ను దక్కించుకున్నారు. ఒమన్‌లోని మస్కట్‌లో రిటైల్ రంగంలో పనిచేస్తున్న శెట్టిగర్, ఈ టికెట్‌ను ఒక స్నేహితుడితో కలిసి కొనుగోలు చేశారు. బహుమతి ప్రకటించాక నిర్వాహకులతో మాట్లాడిన శెట్టిగర్, ఈ అనుకోని విజయం పట్ల ఆశ్చర్యం, సంతోషం వ్యక్తం చేశారు. ప్రణాళిక ప్రకారం గెలుచుకున్న తన టికెట్ భాగస్వామితో పంచుకుంటానని చెప్పారు.
