మేఘాలయ రాష్ట్రంలో అక్రమ బొగ్గు తవ్వకాలు మరోసారి భారీ ప్రాణ నష్టానికి కారణమయ్యాయి. తూర్పున హిల్స్ జిల్లా ఓ గనిలో బొగ్గు తవ్వుతుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 16 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెస్క్యూ టీం ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ గనిని అక్రమంగా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే పేలుడికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. మేఘాలయలో ర్యాట్ హోల్ మైనింగ్ చేస్తూ అశాస్త్రీయ విద్యలో తవ్వకాలు జరుపుతున్నారు. అయితే, ఈ తవ్వకాలను 2014 నుంచి జాతీయ హరిత ట్రైబ్యునల్ నిషేధించింది. ర్యాట్ హోల్ అంటే.. సమాంతరంగా సన్నని గుంత తవ్వుతూ బొగ్గును బయటకు వెలికి తీసే పద్ధతి. సుమారు 3, 4 అడుగుల వెడల్పుతో ఈ గుంతలు ఉంటాయి. అచ్చం ఎలుకలు బొరియలు తవ్వినట్టుగా ఉంటాయి కాబట్టి దీనికి ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అనే పేరు వచ్చింది. ఇటీవల ఈ తవ్వకాలపై ఎన్జీటీ నిషేధాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.
ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వారు గాయపడిన వారు గాయపడిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక అందజేసినట్లు సమాచారం.
