Home సినిమా కవలలు పుడితే ఎందుకు అంత హడావిడి! – Andhra Waves

కవలలు పుడితే ఎందుకు అంత హడావిడి! – Andhra Waves

by
0 comments
కవలలు పుడితే ఎందుకు అంత హడావిడి!



-నిన్న ఉదయం నుంచి చరణ్ కవలల పిల్లల హడావిడి
-ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు
-అభిమానులు ఏమంటున్నారు
-మూవీ లవర్స్ , సినీ విశ్లేషకులు ఏమంటున్నారు

రామ్ చరణ్(రామ్ చరణ్),ఉపాసన(ఉపాసన)దంపతులు కవలలకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఒక అబ్బాయి కాగా ఇంకొకరు అమ్మాయి. నిన్న ఉదయం కవలలు పుట్టాలనే విషయం తెలియగానే మెగా అభిమానులందరు ఉపాసన, పిల్లలు ఉన్న అపోలో హాస్పిటల్ కి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. పెద్ద ఎత్తున ప్లే కార్డ్స్ ధరించి తమ అభిమాన హీరోకి శుభాకాంక్షలు చెప్పారు.మెగా కాంపౌండ్ నుంచి పిల్లలు పుట్టిన విషయాన్నీ స్వయంగా చిరంజీవి నే అధికారకంగా చెప్పడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మీడియా సైతం చిరంజీవి స్పీచ్ ని టెలికాస్ట్ చేసింది. దీంతో అభిమానులు,మీడియా చానెల్స్ చరణ్ పిల్లల డెలివరి పై అత్యుత్సాహం చూపించారనే కామెంట్స్ ని కొంత మంది సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. రోజుకి ఎంతో మందికి పిల్లలు పుడుతున్నారు కదా, వాళ్లందరి గురించి చెప్తున్నారా అనేది కూడా వాళ్ళ కామెంట్స్.

నటి కామెంట్ పై సోషల్ మీడియా వేదికగా అభిమానులు స్పందిస్తూ ‘చిరంజీవి(చిరంజీవి)చరణ్ సుదీర్ఘ కాలం నుంచి తమ నటనతో మమ్మల్ని అలరిస్తూ వస్తున్నారు. వాళ్ళ ఆనందమే మాకు ముఖ్యం. చిరంజీవి ఇటీవల ఒక ఫంక్షన్ లో ఇల్లు మొత్తం ఆడపిల్లలు అయ్యారు. వారసుడు రూపంలో అబ్బాయిని ఇవ్వమని చరణ్ ని అడిగానని చెప్పుకొచ్చాడు. పైగా చరణ్ కి మొదట ఆడపిల్ల. రెండో సారి ఉపాసన తల్లి కాగానే కవల పిల్లలకు జన్మనివ్వబోతుందని చెప్పారు. దీంతో మాలో టెన్షన్ పెరిగింది. చిరంజీవి కోరుకున్నట్టుగా ఆ కవలల ఇద్దరిలో ఒకరు అబ్బాయి అయితే బాగుండని కోరుకున్నాం. మేము అనుకున్నట్టుగానే అబ్బాయి పుట్టడంతో మా ఆనందానికి అవధులు లేవు. అందుకే అపోలో కి వెళ్లి తమ సంతోషాన్ని వ్యక్తం చేశామనే కామెంట్స్ చూస్తున్నారు.

ఇదే విషయంపై మూవీ లవర్స్ స్పందిస్తూ మీడియా ఆ న్యూస్ ని కవరేజ్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. చిరంజీవి ,చరణ్ లు తమ ఛరిష్మాతో సుదీర్ఘ కాలం నుంచి మమ్మల్ని అలరిస్తూ మాలో సంతోషాన్ని నింపుతున్నారు. సామాజిక సేవా పరంగా కూడా ఎన్నో సేవలు చేస్తూ తెలుగు ప్రజలకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు కోట్ల రూపాయల డబ్బులని ఇస్తున్నారు. అలాంటి వారికి వారసుడు రావాలని మేము కూడా కోరుకున్నాం. మీడియాలో ఆ వార్తలు రావాలని మేము కోరుకున్నామనే కామెంట్స్ చేస్తున్నారు.

also read: అట్లీ డైరెక్షన్ లో మెగాప్రిన్స్ వరుణ్ తేజ్.. ఎవరు పాన్ ఇండియా హీరో

సినీ విశ్లేషకులు సైతం ప్రతి సినిమా హీరోలు ఎన్నో ఏళ్ళుగా తమ సినిమాలతో అభిమానులని, ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నారు. ఒక రకంగా అభిమానమే సొసైటీ కి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ అభిమానులతో పాటు ఎంతో మంది జీవితాలు రాంగ్ డైరెక్షన్‌లోకి వెళ్లకుండా చేస్తున్నారు. తెలుగు ప్రజలకి ఎలాంటి కష్టమొచ్చినా కోట్ల రూపాయల డబ్బు ఇస్తున్నారు. అది మన డబ్బే కదా అనుకుంటే పొరపాటే. ప్రపంచంలో ఏ వృత్తి చేసుకొని బతికే వారైనా ప్రజల ద్వారా ఆదాయం సంపాదించే వారే. మరి వాళ్ళందరు కోట్ల రూపాయిల డబ్బు ఇవ్వడం లేదు. కేవలం సినిమా వాళ్లే ఇస్తున్నారు. పైగా వాళ్ళు తమ సినిమా చూడాలని ఎవర్ని లాక్కొచ్చి కూర్చోబెట్టారు కదా! కాబట్టి సుదీర్ఘ కాలం నుంచి సినీ రంగంలో ఉంటున్న వారి ఇంట్లోకి సంబంధించిన వార్తలకు ఇంపార్టెన్స్ ఇవ్వడంలో తప్పు లేదని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird