Home Latest News అక్రమ సంబంధం.. ప్రియుడి భార్య హత్య | ప్రేమికుల భార్యను చంపిన అక్రమ సంబంధం| నల్లగొండ| జిల్లా| కేతేపల్లి – Andhra Waves

అక్రమ సంబంధం.. ప్రియుడి భార్య హత్య | ప్రేమికుల భార్యను చంపిన అక్రమ సంబంధం| నల్లగొండ| జిల్లా| కేతేపల్లి – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


అక్రమ సంబంధం ఒక నిండు ప్రాణాన్ని హరించిన సంఘటన నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లి గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కేతేపల్లి గ్రామానికి చెందిన నగేష్ యాదవ్, మమత దంపతులు. వీరికి ఒక కుమార్తె ఉంది. కాగా నగేష్ మీసాల సుజాత అనే మహిళతో కొంత కాలంగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. సుజాతకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అక్రమ సంబంధం విషయం నగేష్ భార్య మమతకు తెలియడంతో గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ కోరుకునే నాగేష్ ను తన వద్దనే ఉండిపోవాలని సుజాత్ ఒత్తిడి చేయడం, అందుకు నగేష్ అంగీకరించిన గొడవలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలోనే.. సుజాత నగేష్ ఇంటికి అతడి భార్య మమతపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీంతో మమత అక్కడికక్కడే మరణించింది.

ఈ ఘటనలో మమత ఒడిలో ఉన్న ఆరు నెలల పసికందుకు తీవ్రంగా కాలిన గాయాలు అయ్యాయి. ఆ పసికందును ఆసుపత్రికి తరలించిన పోలీసులు సుజాతను అదుపులోకి తీసుకున్నారు. అక్రమ సంబంధమే ఈ దారుణానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. అక్రమ సంబంధాల వల్ల కుటుం బాలు ఎలా నాశనం అవుతాయన్న తర్వాత ఈ సంఘటన కళ్లకు కట్టిందని స్థానికులు చెబుతున్నారు.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird