Home సినిమా 19 ఏళ్ళ తర్వాత నిన్న రిలీజైన ఉపేంద్ర మూవీ.. పునీత్ రాజ్ కుమార్ ఉన్నాడు – Andhra Waves

19 ఏళ్ళ తర్వాత నిన్న రిలీజైన ఉపేంద్ర మూవీ.. పునీత్ రాజ్ కుమార్ ఉన్నాడు – Andhra Waves

by
0 comments
19 ఏళ్ళ తర్వాత నిన్న రిలీజైన ఉపేంద్ర మూవీ.. పునీత్ రాజ్ కుమార్ ఉన్నాడు




-ఉపేంద్ర మూవీ ఎందుకు లేట్ అయ్యింది!
-మూవీలో ఎవరెవరు ఉన్నారు
-ప్రేక్షకాదరణ పొందుతుందా!

చిత్రపరిశ్రమలో కొన్నిసార్లు జరిగే విచిత్రాలు చూస్తుంటే ట్విస్ట్ లతో చిత్రాలు ఇచ్చే థ్రిల్ కంటే ఎక్కువ థ్రిల్ ని ఇస్తుంటాయి. రీసెంట్ గా కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర సినిమా విషయంలో ఇదే జరిగింది. పంతొమ్మిది సంవత్సరాల తరవాత ఉపేంద్ర సినిమా థియేటర్స్ లో అడుగుపెట్టగా, ఉపేంద్ర(ఉపేంద్ర)కి రిలీజ్ విషయం కూడా తెలియదు. పైగా మూవీలో పదిహేను మంది స్టార్స్ కూడా ఉన్నారు. ఏంటి ఇప్పుడు ఇదంతా నమ్మాలా అని అనుకుంటున్నారా! అయితే పూర్తి డీటెయిల్స్ చూసి మీ నమ్మకం తప్పు కాదని మీరే తెలుసుకోండి.

రక్త కాశ్మీర. ఉపేంద్ర, స్టార్ హీరోయిన్ రమ్య జంటగా 2007లో షూటింగ్ ప్రారంభించింది. కానీ 19 సంవత్సరాల తర్వాత నిన్నకన్నడ నాటక థియేటర్లలో ప్రత్యక్షమయ్యింది. ఇన్ని రోజులు ఎందుకు రిలీజ్ కాలేదనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. పంతొమ్మిది సంవత్సరాల తర్వాత థియేటర్లలో పెట్టి అభిమానుల ఆనందాన్ని నింపింది. అయితే రిలీజ్ విషయం ఉపేంద్ర కి తెలియదనే టాక్ కన్నడ వర్గాల్లో వినపడుతుంది. ఆ మాటలకి బలాన్ని చేకూర్చేలా రిలీజ్ పై మీడియా సమావేశాలు ఏర్పాటు చేయలేదు. సైలెంట్ గానే స్క్రీన్ పైకి వచ్చేసింది.

ఇది కూడా చదవండి: నిన్ను ఆ బట్టల్లో చూడాలని ఉందన్నాడు..ఇతనేనా అతను

ఇక రక్త కాశ్మీర కి ఉన్నస్పెషల్ ఏంటంటే ఒక సాంగ్ లో పునీత్ రాజ్ కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్, దర్శన్, యష్, శివరాజ్ కుమార్ ఇలా 15 మంది హీరోలు దాకా క్యామియో ఇచ్చారు. వీరి సాంగ్ 18 నిమిషాల పాటు ఉండటం విశేషం.కథ గురించి చెప్పుకోవాలంటే స్టంట్ ట్రైనర్ అనాథ పిల్లల కోసం ఒక స్టంట్ ట్రైనింగ్ స్కూల్ నడుపుతున్నాడు. ఆ అనాథ పిల్లలు టెర్రరిస్టుల బాంబు పేలుడు ప్లాన్ గురించి తెలుసుకుంటారు.

దాంతో టెర్రరిస్టులు పిల్లలను అపహరించి కాశ్మీర్ కి తీసుకెళ్తారు. ట్రైనర్, తన ప్రేయసితో కలిసి కాశ్మీర్ పిల్లలను ఎలా కాపాడారనేదే చిత్ర కథ. ఏం డి ఏం ప్రొడక్షన్స్ నిర్మించగా రాజేంద్ర సింగ్ బాబు(రాజేంద్ర సింగ్ బాబు)దర్శకుడు. కంప్లీట్ అడ్వెంచర్ డ్రామా ప్రదర్శించింది.నిడివి 133 నిమిషాలు మాత్రమే. మరి ప్రేక్షకాదరణని ఏ మాత్రం అందుకుంటుందో చూడాలి.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird