మహారాష్ట్రలోని బారామతి విమాన ప్రమాదంపై డీజీసీ వర్గాలు కీలక విషయాలు వెల్లడించాయి. ఫైలట్ల నుంచి మేడే కాల్ (సాయం కోరడం) రాలేదని. రన్ వేను గుర్తించడంలో పైలట్లు ఇబ్బందిపడ్డారని. ఇది టేబుల్ టాప్ రన్వే ఎత్తయిన కొండ ప్రాంతం. తొలి ప్రయత్నంలో రన్‌పే కనిపించిన విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. రెండోసారి చేసిన ల్యాండింగ్ ప్రయత్నం విఫలమై కుప్పకూలింది. అని వివరించారు. ఈ విమానానికి కెప్టెన్ సుమిత్ కపూర్ కమాండర్‌గా వ్యవహరించగా, శాంభవి పాఠక్ ఫస్ట్ ఆపీసర్‌గా (కోఫైలట్) ఉన్నారు. అజిత్ పవార్ మృతికి ఆ రాష్ట్ర ప్రభుత్వం సంతాప దినాలను ప్రకటించింది.
విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం పవార్ ఉన్నాడని ఎలా గుర్తించారో ప్రత్యక్ష సాక్షులు. గాగుల్స్, చేతివాచీ ఆధారంగా అజిత్ ను గుర్తించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వాటి ఆధారంగానే ప్రమాదానికి గురైంది డిప్యూటీ సీఎం అని తెలుసుకున్నామని అన్నారు. ప్రమాదం తర్వాత జరిగిన నాలుగైదు పేలుడు శబ్దాలు వినిపించినట్లు చెప్పారు. తమ కళ్ల ముందే ప్రమాదం జరిగిందని, విమానం కిందకు వస్తుంటే అది కూలిపోయేలా ఉందని మీకు అనిపించిందని అన్నారు.
ఆ సమయంలో విమానం నుంచి శబ్ధం కూడా భిన్నంగా వచ్చినట్లు తెలిపారు. కాసేపటికే విమానం కుప్పకూలిందని, పెద్ద ఎత్తున మంటలు రావడంతో పాటు నాలుగైదు భారీ శబ్ధాలు వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు ఉన్నాయి. తాము వెంటనే ప్రమాదస్థలానికి చేరుకుని, అందులో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేశామని అన్నారు. రెండు మృతదేహాలు బయటకు ఎగిరిపడ్డాయని, ప్రమాదస్థాయి అంత తీవ్రంగా ఉందని అన్నారు .బుధవారం నుంచి మూడు రోజుల పాటు జనవరి (28-30) రాష్ట్ర సంతాప దినాలను ఉంటాయని అధికారులు తెలిపారు. అజిత్ మృతిపై సంతాపంగా మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.