సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పీపీపీ పద్దతిలో పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ అభివృద్ధికి మంత్రి వర్గం ఆమోదించారు. ఏపీ టిడ్కోకు హడ్కో నుంచి రూ.4,451 కోట్ల ప్రభుత్వ రుణ గ్యారెంటీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. టీటీడీ వరకు పలు పోస్టుల అప్‌కు కేబినెట్ ఆమోదం. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా సంస్థలతో పాటు.. అల్లూరి జిల్లా నందకోటలో టూరిస్ట్ ఫైవ్‌స్టార్ రిసార్ట్ కోసం ల్యాండ్ కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం.
అర్జున అవార్డు గ్రహీత జ్యోతికి విశాఖలో 500 చదరపు గజాల స్థలం ఇచ్చేందుకు నిర్ణయించింది. డిగ్రీ తర్వాత జ్యోతికి గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం లభించింది. మరోవైపు తిరుమల నెయ్యి కల్తీకి సంబంధించిన సిట్ నివేదికపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. సిట్ నివేదికపై వైసీపీ నేతల దుష్ప్రచారంపై ప్రధానంగా చర్చ జరిగింది. టీటీడీ నెయ్యి కల్తీపై సిట్ నివేదిక తెప్పించాలని కేబినెట్ కోరింది. ఇప్పటికే సీబీఐ సిట్ చార్జ్షీట్ వేసిన అధికారులు కేబినెట్‌కు తెలిపారు.
ఎస్వీ వర్సిటీ పరిధిలోని 33 ఎకరాల భూమిని వ్యవసాయ మార్కెట్ కమిటీకి బదిలీపై చర్చించారు. పలమనేరులో లైవ్‌స్టాక్ రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటుకు భూ బదిలీ ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అమరావతి పరిధిలోని వీధిపోటు భూములు పొందిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లకు ఆమోదం. అమరావతి భూములు లేని పేదలకు, అనాథ పిల్లలకు పింఛన్ల కోసం గ్రీన్‌సిగ్నల్. టీటీడీ పలు పోస్టుల అప్‌కు, పలు సంస్థలకు భూకేటాయింపులకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతిపై కేబినెట్ సంతాపం వ్యక్తం చేసింది.