15

తెలంగాణ జాగృతి ఇక రాజకీయపార్టీగా అవతరించనుంది. ఈ మేరకు తన కొత్త రాజకీయపార్టీ పేరును తెలంగాణ జాగృతిగా పెట్టాలని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కవిత నిర్ణయించారు. ఇందు కోసం ఆమె కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేయడమే కాకుండా.. త్వరగా తన పార్టీకి అధికారిక గుర్తింపునకు ఆమె స్వయంగా ఢిల్లీ వెళ్లి మరీ అవసరమైన ప్రక్రియను పూర్తి చేసి వచ్చారు.
ఇక ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం తెలంగాణ జాగృతికి మూడు నెలల వ్యవధిలో రాజకీయపార్టీగా అధికారిక గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణ సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు, కార్యకలాపాలకే పరిమితమైన తెలంగాణ జాగృతి, ఇక పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మారనుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే.. వచ్చే జీహెచ్‌సీ ఎన్నికలలో తెలంగాణ జాగృతి అభ్యర్థులను పోటీలో నిలబెట్టాలని కల్వకుంట్ల కవిత. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణ జాగృతి రాజకీయాలను క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు కవితపార్టీ చర్యలు తీసుకుంటున్నారు. ఈ కోరికనే అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ ఉద్యమ కారులను ఏకం చేసే దిశగా ఆమె అడుగులు వేస్తున్నారు.