జనవరి 27, 2026 2:20PMన పోస్ట్ చేయబడింది

టీ20 ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్ విషయంలో ఐసీసీ తీసుకుంటున్న నిర్ణయాలపై వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే భారత్‌లో మ్యాచులు ఆడబోమని తేల్చి చెప్పడంతో బంగ్లాదేశ్‌ను వరల్డ్ కప్ నుంచి తొలగించి స్కాట్లాండ్‌ను ప్రత్యామ్నాయ జట్టుగా ఐసీసీ ప్రకటించింది. ఆ సద్దుమణిగీ మణగక ముందే ఐసీసీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీకవరేజీ కోసం దరఖాస్తు చేసుకున్న వంద మందికి పైగా బంగ్లా స్టోర్స్ జర్నలిస్టుల అక్రిడేషన్ దరఖాస్తులను తిరస్కరించింది.
బంగ్లా మీడియాను ఐసీసీ దూరం పెట్టడం వెనుక కారణాలేమిటన్నది వెంటనే తెలియలేదు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మీడియా కమిటీ చైర్మన్ అంజద్ హుస్సేన్ బంగ్లాదేశ్ స్పోర్ట్స్ జర్నలిస్టుల దరఖాస్తులను ఐసీ తిరస్కరించిన ఎంపికను ధృవీకరించారు. ఈసారి సుమారు 130 నుంచి 150 మంది బంగ్లాదేశ్ జర్నలిస్టులు అక్రిడేషన్‌కు దరఖాస్తు చేసుకోగా వారిలో ఒక్కరికి కూడా అనుమతి లభించలేదని ఆయన చెప్పారు. తమకు తెలిసినంత వరకు బంగ్లాదేశ్‌కు చెందిన జర్నలిస్టులందరి దరఖాస్తులను ఐసీ తిరస్కరించిందనీ, ఇంతకు ముందు ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని అంజద్ ఉన్నారు. మరోవైపు.. జనవరి 20, 21 తేదీలలో ఐసీసీ మీడియా విభాగం నుంచి అప్రూవల్ పొందిన కొందరు ఫోటో జర్నలిస్టుల అక్రిడేషన్ దరఖాస్తులను కూడా ఆ తర్వాత రద్దు చేసినట్లు సమాచారం. ఐసీసీ నుంచి అప్రూవల్ మెయిల్, వీసా సపోర్ట్ లెటర్ కూడా వచ్చిన తరువాత ఇప్పుడు అకస్మాత్తుగా దరఖాస్తు తిరస్కరించినట్లు మరో మెయిల్ వచ్చిందని బలాంగ్‌కు చెందిన ఓ జర్నలిస్టు వాపోయాడు.
వరల్డ్ కప్ టోర్నీ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ వివాదంపై ఐసీసీ ఇంకా మౌనం వీడలేదు. బంగ్లాను టోర్నీ నుంచి తప్పించడమే కాకుండా జర్నలిస్టుల అక్రిడేషన్‌ను తిరస్కరించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
