Home Latest News జాతీయ బాలికల దినోత్సవం.. ఆడపిల్లల భవితకు ఓ చేయూత..! | జాతీయ బాలికా దినోత్సవం| జాతీయ బాలికా దినోత్సవం ప్రాముఖ్యత| జాతీయ బాలికా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు| జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు – Andhra Waves

జాతీయ బాలికల దినోత్సవం.. ఆడపిల్లల భవితకు ఓ చేయూత..! | జాతీయ బాలికా దినోత్సవం| జాతీయ బాలికా దినోత్సవం ప్రాముఖ్యత| జాతీయ బాలికా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు| జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు – Andhra Waves

by andhra andhrawave
0 comments
జాతీయ బాలికల దినోత్సవం.. ఆడపిల్లల భవితకు ఓ చేయూత..! | జాతీయ బాలికా దినోత్సవం| జాతీయ బాలికా దినోత్సవం ప్రాముఖ్యత| జాతీయ బాలికా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు| జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు


జనవరి 24, 2026 1:37PMన పోస్ట్ చేయబడింది


ఆడపిల్ల ఇంటికి వెలుగు అంటారు. ఆడపిల్ల ఇంట్లో ఉంటే మహాలక్ష్మి ఇంట్లో ఉన్నట్టే అని కూడా అంటారు. అయితే కొన్ని దశాబ్దాల క్రితం ఆడపిల్ల పుడితే పురిట్లోనే చిదిమేసేవారు, ఇంకొందరు బ్రూణ హత్యలు చేయించేవారు. ఈ కారణాల వల్ల ప్రస్తుతం పిల్లలతో ప్రస్తుత ఆడపిల్లల నిష్పత్తి తక్కువగా ఉంది. పెళ్లిళ్ల కోసం ఆడపిల్లలు కరువయ్యారు అంటూ పెద్దలు మొరపెట్టుకుంటున్నారు. అయితే ఆడపిల్లల గురించి, వారి భవిత గురించి ఆలోచించి ప్రతి సంవత్సరం జనవరి 24వ తేదీన జాతీయ బాలికల దినోత్సవం జరుపుకుంటున్నారు, బాలికల హక్కులు, వారి భద్రత, విద్య, ఆరోగ్య దినోత్సవం గురించి సమాజంలో అవగాహన కల్పించేందుకే ఈ రోజు జరుపుకుంటారు. ఈ రోజు గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..

జాతీయ బాలికల దినోత్సవం..

2008 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రారంభించింది. మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్), భారత ప్రభుత్వం కలిసి ఉమ్మడిగా ఈ రోజును జరుపుకోవాలని పిలుపునిచ్చింది.

జనవరి 24నే ఎందుకు..

ఈ తేదీకి ప్రత్యేకమైన చారిత్రక సంఘటన ఏమీ లేదు. కానీ బాలికల హక్కులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టేందుకు, సంవత్సర ఆరంభంలోనే సమాజానికి ఒక బలమైన సందేశం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ తేదీని ఎంపిక చేశారు.

ఎందుకు జరుపుకుంటారు..

సమాజంలో బాలికలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా.. బాల్యవివాహాలు, శిశుహత్యలు, లింగ వివక్ష, బాలికల విద్యకు అవకాశం కల్పించడం, ఆరోగ్యం, పోషణలో నిర్లక్ష్యం వంటి సమస్యలు ఎక్కువగా ఉండేవి. ఈ సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించి, బాలికలకు సమాన హక్కులు, గౌరవం, అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ప్రధాన లక్ష్యాలు..

బాలికలపై జరుగుతున్న వివక్షను తగ్గించడం, బాలికల విద్యను ప్రోత్సహించడం, బాల్యవివాహాలు, ఆడ పిల్లలను పురిటిలో లేదా కడుపులోనే హత్య చేయడం, వంటి దారుణమైన కార్యకలాపాలను అరికట్టడం, బాలికల ఆరోగ్యం, భద్రతపై దృష్టి పెట్టడం వంటి కార్యక్రమాలను నిర్వహించడం ఈ రోజు ప్రధాన లక్ష్యాలలో భాగంగా ఉంటుంది. అదేవిధంగా.. బాలికలు కూడా సమాజానికి ఒక బలం అనే భావనను పెంపొందించడం దీని లక్ష్యం.

ఎలా జరుపుకుంటారు..

పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం. వ్యాసరచన, ప్రసంగ పోటీలు, బాలికల హక్కులపై చర్చలు, ర్యాలీలు. ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం. బాలికలను ప్రోత్సహించే కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఈ రోజున జరుపుకుంటారు.

బాలికల గౌరవం, హక్కులు, భవిష్యత్తుపై దేశంలోని ప్రతి ఒక్కరి బాధ్యతను గుర్తు చేసే రోజు ఇది. ముఖ్యంగా ఆడపిల్ల చదువు బారం అనే రోజు నుండి బాలిక చదువుకుంటే దేశం అభివృద్ధి చెందుతుంది అని దేశం మొత్తం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఇలాంటి రోజులలో ప్రజలకు అవగాహన కల్పించడం వల్లే వచ్చింది. బాలికల చదువును ప్రోత్సహించి, వారి రక్షణ చూసుకోవాల్సిన బాధ్యత దేశ పౌరుల మీద ఖచ్చితంగా ఉంటుంది.

*రూపశ్రీ.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird