Home Latest News ఏపీ లిక్కర్ స్కామ్.. విజయసాయి వాంగ్మూలం రికార్డ్ చేసిన ఈడీ | EC రికార్డులు విజయసాయి ప్రకటన| ఆంధ్ర| ప్రదేశ్| మద్యం – Andhra Waves

ఏపీ లిక్కర్ స్కామ్.. విజయసాయి వాంగ్మూలం రికార్డ్ చేసిన ఈడీ | EC రికార్డులు విజయసాయి ప్రకటన| ఆంధ్ర| ప్రదేశ్| మద్యం – Andhra Waves

by andhra andhrawave
0 comments
ఏపీ లిక్కర్ స్కామ్.. విజయసాయి వాంగ్మూలం రికార్డ్ చేసిన ఈడీ | EC రికార్డులు విజయసాయి ప్రకటన| ఆంధ్ర| ప్రదేశ్| మద్యం


పోస్ట్ చేయబడింది జనవరి 22, 2026 12:28PM


ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు పెరిగింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ విజయసాయిని గురువారం (జనవరి 22) విచారించి, ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేసింది. జగన్ హయాంలో మద్యం విధాన రూపకల్పన, అమలులో జరిగిన అవకతవకలు, అవినీతి, అక్రమాలపై ఈడీ విజయసాయిపై ప్రశ్నల వర్షం కురిపించింది. అలాగే భారీగా అవినీతి చోటుచేసుకుందన్న ఆరోపణలపైనా ఈడీ విజయసాయిని సుదీర్ఘంగా విచారించింది. అదే విధంగా మద్యం కుంభకోణం ద్వారా అక్రమంగా వచ్చిన నగదును విదేశాలకు తరలించిన అంశం హవాలా వినియోగం, కంపెనీల ఏర్పాటు ద్వారా మనీ లాండరింగ్ జరిగిందా అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది.

డిజిటల్ పేమెంట్స్ అందుబాటులో ఉన్న ఏపీలో మద్యం విక్రయాలు క్యాష్ అండ్ క్యారీ రూపంలోనే నగదు రూపంలో ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందన్న అంశంపై ఈడీ అధికారులు విజయసాయిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మద్యం పాలసీ రూపకల్పనపై తన సమక్షంలోనే మూడు సార్లు సిట్టింగులు జరిగినట్లు విజయ్ సాయి రెడ్డి ఈడీకి వాంగ్మూలం ఇచ్చినట్లూ, అయితే ఆ పాలసీ రూపకల్పనతో తనకు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు తెలిసింది.

ఇక ఇదే కేసుకు సంబంధించి ఈడీ శుక్రవారం వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ మిథున్ రెడ్డిని విచారించనుంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు కీలక పాత్రలపై ఫోకస్ పెట్టిన ఈడీ.. రానున్న రోజులలో మరింత మందిని విచారించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ కేసు రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకోవడంతో విజయసాయి, మిథున్ రెడ్డిల విచారణ అనంతరం ఈడీ టార్గెట్ ఎవరన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird