Home Latest News రోడ్డు ప్రమాదంలో ప్రైవేటు బస్సు దగ్ధం.. ముగ్గురు సజీవ దహనం | ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు| రహదారి| ప్రమాదం| మూడు| కాలింది – Andhra Waves

రోడ్డు ప్రమాదంలో ప్రైవేటు బస్సు దగ్ధం.. ముగ్గురు సజీవ దహనం | ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు| రహదారి| ప్రమాదం| మూడు| కాలింది – Andhra Waves

by andhra andhrawave
0 comments
రోడ్డు ప్రమాదంలో ప్రైవేటు బస్సు దగ్ధం.. ముగ్గురు సజీవ దహనం | ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు| రహదారి| ప్రమాదం| మూడు| కాలింది


జనవరి 22, 2026 9:27AMన పోస్ట్ చేయబడింది


నంద్యాల జిల్లాలో ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు సజీవదహనమయ్యారు. నెల్లూరు నుంచి 36 మంది ప్రయాణీకులతో హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైరు పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. శిరివెళ్లమెట్ట వద్ద బస్సు టైర్ పేలడంతో బస్సు అదుపుతప్పి డివైడర్ ను దాటి ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది.

దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ప్రైవేటు బస్సు టైరు పేలడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సు డ్రైవర్, క్లీనర్, లారీ డ్రైవర్, సజీవ దహనమయ్యారు. కాగా అదే సమయంలో అటుగా వెళ్తున్న డీసీఎం డ్రైవర్ తన వాహనాన్ని నిలిపివేసి బస్సులో ప్రయాణీకులను అప్రమత్తం చేయడమే కాకుండా, బస్సు కిటికీల అద్దాలను పగులగొట్టడంతో ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. పదిహేను మంది గాయపడ్డారు. డీసీఎం డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల భారీ ప్రాణనష్టం తప్పింది.

కాగా ఈ ఘటనలో లారీ పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్, లారీ డ్రైవర్, క్లీనర్‌ల మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చూశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird