జనవరి 21, 2026 9:27AMన పోస్ట్ చేయబడింది

ప్లేట్లో చేతులు కడిగిన విషయంపై ఘర్షణ ఏకంగా యువకుడి హత్యకు దారి తీసిన అమానుష సంఘటన సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఉస్మాన్ నగర్లోని హోమ్ ట్రీ అపార్ట్ మెంట్స్లో అధునాతన కార్పెంటర్ శ్యామ్ పంచాలు (28) అన్నం ప్లేటులో చేతులు కడిగిన విషయం వాగ్వాదంలో హత్యకు దారితీసింది.
పోలీసుల కథనం ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జాలున్ జిల్లా గోరాంగ్ గ్రామానికి చెందిన పంచాలు వృత్తిరీత్యా కార్పెంటర్.గత మూడు రోజులుగా ఉస్మాన్నగర్లోని హోమ్ ట్రీ అపార్ట్ మెంట్స్లో మిథ్లేష్ కుమార్, అతుల్ సహానీ అనే ఇద్దరు సహోద్యోగులతో కలిసి ఉన్నారు.
సోమవారం (జనవరి 19) ఉదయం ముగ్గురు కలిసి భోజనం చేస్తుండగా, శ్యామ్ పంచాలు అతుల్ సహానీ ప్లేటులో చేతులు కడిగిన విషయం వివాదానికి దారితీసింది. వివాదం ముదిరి ఘర్షణకు దారి తీసింది. ఆగ్రహానికి గురైన అతుల్ సహానీ గుర్తు తెలియని వస్తువుతో శ్యామ్ పంచాలపై దాడి చేశాడు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన శ్యామ్ పంచాల అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కొల్లూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడు అతుల్ సహానిని అదుపులోకి తీసుకున్నారు.
.webp)