Home Latest News శబరిమలలో మకర జ్యోతి దర్శనం.. పులకించిన భక్త జనం | శబరిమలలో మకరజ్యోతి దర్శనం| అయ్యపా| భక్తులు| భక్తి – Andhra Waves

శబరిమలలో మకర జ్యోతి దర్శనం.. పులకించిన భక్త జనం | శబరిమలలో మకరజ్యోతి దర్శనం| అయ్యపా| భక్తులు| భక్తి – Andhra Waves

by andhra andhrawave
0 comments
శబరిమలలో మకర జ్యోతి దర్శనం.. పులకించిన భక్త జనం | శబరిమలలో మకరజ్యోతి దర్శనం| అయ్యపా| భక్తులు| భక్తి


పోస్ట్ చేయబడింది జనవరి 15, 2026 7:00AM


ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో బుధవారం (జనవరి 14) సాయంత్రం మకరజ్యోతి దర్శనం కనువిందు చేసింది. అశేష భక్తజన సందోహం మధ్య అయ్యప్ప భక్తులు ప్రత్యక్షంగా మకర జ్యోతి దర్శనం చేసుకున్నారు. పొన్నాంబలమేడు కొండపై మకరజ్యోతి మూడుసార్లు భక్తులకు దర్శనమిచ్చింది. ఈ అపురూప దృశ్యాన్ని తిలకించిన లక్షలాది మంది భక్తజనం స్వామియే శరణం అయ్యప్ప తన్మయత్వంలో మునిగిపోయారు.

అంతకుముందు.. పందళం రాజప్రసాదం నుంచి తీసుకొచ్చిన పవిత్రమైన తిరువాభరణాలను అయ్యప్ప స్వామికి అలంకరించారు. అనంతరం, ఆలయ పూజారులు స్వామివారికి ప్రత్యేక దీపారాధన చేశారు. ఆ వెంటనే పొన్నాంబలమేడు కొండపై దివ్యజ్యోతి కనిపించడంతో శబరిగిరులు అయ్యప్ప నామ స్మరణతో మార్మోగిపోయాయి. అయ్యప్ప భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. మకరజ్యోతి దర్శనం సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ట్రావెన్‌కోర్‌ దేవస్ధానం బోర్డు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird