జనవరి 12, 2026 9:42AMన పోస్ట్ చేయబడింది

గణతంత్ర దినోత్సవ వేడుకల తరుణంలో భారత్ పై భారీ దాడులకు పాకిస్థాన్ ఉగ్ర సంస్థ హమ్మద్ కుట్ర పన్నుతోంది. భారత్ పై దాడులకు వేల మంది బాంబర్లు అంటే ఆత్మాహుతి దళ సభ్యులు రెడీగా ఉన్నారన్న సమాచారం కలకలం రేపింది. దీనికి సంబంధించి నిషేధిత ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ఆడియో క్లిప్పింగ్ ఆదివారం సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది.
మసూద్ అజహర్ గొంతుకగా చెబుతున్న ఈ ఆడియో క్లిప్పింగ్ లో భారత్‌పై దాడులకు వేలమంది ఆత్మాహుతి దళ సభ్యులు సిద్ధంగా ఉన్నానన్న హెచ్చరికలు కలకలం రేపాయి. ఈ ఆడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. ఆ ఆడియో ప్రకారం వెయ్యి మందికి పైగా ఆత్మాహుతి సభ్యులు భారత్ పై ఏ క్షణంలోనైనా దాడికి దిగే అవకాశం ఉంది. తమ యోధులు ప్రాపంచిక సుఖాల కోసం కాకుండా షహాదత్ అంటే అమరత్వం బలిదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆ ఆడియో ప్రదర్శించారు. ఇలా అమరత్వం కోసం భారత్ పై ఆత్మాహుతి దాడులకు సిద్ధంగా ఉన్న వారి సంఖ్య పదాలు, వందలు, వేలూ కాదనీ, అంతకు మించి అని ఆ ఆడియోలో స్పష్టంగా ఉంది. అయితే ఈ స్పష్ట ఆడియో ప్రామాణికతపై ఇంత వరకూ ఎటువంటి సమాచారం లేదు.
అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి మసూద్ అజహర్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పాకిస్థాన్ లో ఆ నిషేధిత ఉగ్ర సంస్థ అధినేతకు రాచమర్యాదలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. పాకిస్థాన్ లో రాజభోగాలు అనుభవిస్తూ.. అక్కడ నుంచి భారత్ పై విషం చిమ్ముతూ మసూద్ అజహర్ పలు ఉగ్రదాడికి కుట్రపన్నిన సంగతి తెలిసిందే. 2001 పార్లమెంట్ దాడి, 2008 ముంబై దాడులతో సహా పలు భారీ ఉగ్రవాద ఘటనలకు మసూద్ అజహరే సూత్రధారి అన్న సంగతి విదితమే. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తరువాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ భారీగా నష్టపోయింది.
ఆ సంస్థకు చెందిన అనేక మందిని భారత్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ భాగంగా జరిపిన దాడుల్లో హతం చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మసూద్ అజహర్ విడుదల చేసినట్లు చెబుతున్న ఆడియో హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది. ఈ హెచ్చరికల నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. సరిహద్దుల వెంబడి గస్తీని కట్టుదిట్టం చేశాయి.
