Home సినిమా జన నాయకన్ రిలీజ్ డేట్ వాయిదా.. రేపు కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది – Andhra Waves

జన నాయకన్ రిలీజ్ డేట్ వాయిదా.. రేపు కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది – Andhra Waves

by
0 comments
జన నాయకన్ రిలీజ్ డేట్ వాయిదా.. రేపు కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది



-తీవ్ర నిరాశలో విజయ్ ఫ్యాన్స్
-కోర్టు తీర్పు అనుకూలమా!ప్రతికూలమా
-తమిళ మీడియా వర్గాలు ఏమంటున్నాయి

నాలుగు దశాబ్దాల సినీ ఛరిష్మాకి గుడ్ బై చెప్తు ఇళయదళపతి ‘విజయ్’ సిల్వర్ స్క్రీన్ పై చేస్తున్న చివరి మూవీ ‘జననాయగన్’. దీనితో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఎంతో భావోద్వేగ వాతావరణం నెలకొని ఉంది. ఈ నెల 9న రిలీజ్ డేట్ కాగానే ఈ రోజు నైట్ నుంచే బెనిఫిట్ షో చూడటం కోసం అభిమానులు భారీ ఎత్తున నిర్వహించారు. బుకింగ్స్ కూడా తమిళనాడు తో పాటు ప్రీ భాగాల క్లోజ్ అయ్యాయి. కానీ ఇప్పుడు వాళ్ల ఆశలకి బ్రేక్ వచ్చింది.

జన నాయకన్ సెన్సార్ సభ్యులు ఇంకా సెన్సార్ ని ఇవ్వలేదన్న వార్తలు రెండు రోజుల నుంచి వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనితో చిత్ర బృందం చెన్నై హైకోర్టు ని ఆశ్రయించగా ప్రస్తుతం కేసు కోర్టులో నడుస్తోంది. ఈ నేపథ్యంలో కోర్టు తమ తీర్పును జనవరి 9 నే వెల్లడి చేయనుంది. దీనితో చిత్ర నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ సోషల్ మీడియా వేదికగా మా నియంత్రణకు మించిన అనివార్య పరిస్థితుల కారణంగా జన నాయకుని విడుదల వాయిదా వేస్తున్నాం. కొత్త రిలీజ్ డేట్ ని ఇంకా త్వరగానే ఉంటుంది. మీ అందరి మద్దతు మా జన నాయకన్ బృందానికి గొప్ప బలం’ అని
ఎక్స్ వేదికగా తెలియచేసింది. దీంతో విజయ్ అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోవడమే కాకుండా రేపు వచ్చే కోర్టు తీర్పుపై ఉత్కంఠతో ఎదురుచూస్తూ ఉన్నారు.

ఇది కూడా చదవండి: ఆ డైరెక్టర్ మన శంకరవరప్రసాద్ గారుకి ప్రతిపక్షమేనా!.. అసలేం జరుగుతుంది

ఇక రిలీజ్ వాయిదా తో సినీ వర్గ సోషల్ మీడియా వేదికగా జన నాయకన్ లో రాజకీయపరమైన సంభాషణలు చాలా తీవ్ర స్థాయిలోనే ఉన్నాయని, ఆ డైలాగ్స్ ని తొలగించమని సెన్సార్ చెప్పిన చిత్ర యూనిట్ కూడా ఒప్పుకోలేదనే విషయాన్నీ వెల్లడిస్తున్నాయి.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird