Home Latest News తిరుమల పవిత్రతను దెబ్బతీయడానికి వైసీపీ ఏం చేసిందంటే?.. | తిరుమలకు మద్యం సీసాలు తీసుకొచ్చిన వైసీపీ ఉద్దేశ్యమే| కళంకం| పవిత్రత| పోలీసు| దర్యాప్తు| అరెస్టు – Andhra Waves

తిరుమల పవిత్రతను దెబ్బతీయడానికి వైసీపీ ఏం చేసిందంటే?.. | తిరుమలకు మద్యం సీసాలు తీసుకొచ్చిన వైసీపీ ఉద్దేశ్యమే| కళంకం| పవిత్రత| పోలీసు| దర్యాప్తు| అరెస్టు – Andhra Waves

by andhra andhrawave
0 comments
తిరుమల పవిత్రతను దెబ్బతీయడానికి వైసీపీ ఏం చేసిందంటే?.. | తిరుమలకు మద్యం సీసాలు తీసుకొచ్చిన వైసీపీ ఉద్దేశ్యమే| కళంకం| పవిత్రత| పోలీసు| దర్యాప్తు| అరెస్టు


జనవరి 8, 2026 9:12AMన పోస్ట్ చేయబడింది


తిరుమల పవిత్రతను దెబ్బతీయడం, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించడమే లక్ష్యంగా జరిగిన కుట్రను పోలీసులు ఛేదించారు. తిరుమలలొ ఓ గెస్ట్ హౌస్ వద్ద ఖాళీ మద్యం సీసాల కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించి అరెస్టు చేసిన వారిని పోలీసులు బుధవారం (జనవరి 7) మీడియా ముందు ప్రవేశ పెట్టారు.

ఈ నెల 4న సామాజిక మాధ్యమంలో తిరుమలలో పోలీసు గెస్ట్ హౌస్ సమీపంలో ఖాళీ మద్యం సీసాలు అంటూ, ఫొటోలతో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దర్యాప్తు చేపట్టిన పోలీసులు తిరుమల పవిత్రతను దెబ్బతీయడమే లక్ష్యంగా ఖాళీ మద్యం సీసాలను వైసీపీ నేతలు, ఆ పార్టీకి చెందిన మీడియా వ్యక్తులు కుట్రపూరితంగా తిరుపతి నుంచి తీసుకొచ్చి కౌస్తుభం గెస్ట్ హౌస్ పక్కన పొదల్లో పడేశారని తేల్చారు. వైసీపీ మీడియా ప్రతినిధులతో పాటు తిరుపతిలోని వైసీపీ నేతలే ఈ కుట్రను అమలు చేసినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు కమాండ్ కంట్రోల్‌తో పాటు, వివిధ ప్రదేశాలలో సిసి కెమెరాలను పరిశీలించారు. అలాగే ఎక్సైజ్ డిపార్టుమెంటు సహకారంతో ఖాళీ సీసాల పైన ఉన్న ఆధారాల ద్వారా, వాటిని కొనుగోలు చేసిన వస్తువులను పేర్కొన్నారు. టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక దెబ్బతీయడానికే వైసీపీ నేతలు ఈ పని చేసినట్లు నిర్ధారించారు. సీసీ కెమెరాలు, ఫాస్టాగ్ నివేదిక, నిందితుల వాహనాల రాక పోకలు, ఫోన్ సిగ్నల్స్ సహా ఇతర సాంకేతిక ఆధారాలతో ఈ కుట్రను ఛేదించినట్లు తిరుపతి పోలీసులు మీడియాకు వివరించారు. ఈ కేసుకు సంబంధించి వైసీపీ కార్యకర్త కోటి, ఆ పార్టీ అధికారిక మీడియా ప్రతినిధి మోహన్ కృష్ణను అరెస్టు చేసినట్లు తెలిపిన పోలీసులు, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త నవీన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడనీ, అతడి కోసం గాలిస్తున్నామనీ తెలిపారు. ఇలా ఉండగా అరెస్టు చేసిన ఇద్దరినీ, కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు వారికి పదివేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిలు ఇచ్చింది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird