పోస్ట్ చేయబడింది జనవరి 4, 2026 2:54PM

సంక్రాంతి పండుగకు ఊరెళ్లే వారికి హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. పండుగకు స్వస్థలాలకు వెళ్లే ముందు సమీప పోలీస్ స్టేషన్ లేదా బీట్ ఆఫీసర్ కు తెలియజేయాలని సీపీ సూచించారు. ప్రయాణ సమయంలో నగదు, బంగారం లేదా ఇతర విలువైన వస్తువులను ఇంట్లో ఉంచుకోని వాటిని బ్యాంకు లాకర్లలో లేదా ఇతర సురక్షిత ప్రదేశాల్లో భద్రపరలని సజ్జనార్ తెలిపారు. దొంగతనాల నివారణ కోసం, నేరాల నియంత్రణ కోసం పోలీసులకు సహకరించిందని సీపీ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కి కాల్ చేయాలని సూచించారు.
.webp)