Home Latest News జింక మాంసం విక్రయిస్తున్న చికెన్ షాన్ ఓనర్ అరెస్టు | చికెన్ షాపు యజమాని అరెస్ట్| అమ్మడం| జింక| మాంసం| అడవి – Andhra Waves

జింక మాంసం విక్రయిస్తున్న చికెన్ షాన్ ఓనర్ అరెస్టు | చికెన్ షాపు యజమాని అరెస్ట్| అమ్మడం| జింక| మాంసం| అడవి – Andhra Waves

by andhra andhrawave
0 comments
జింక మాంసం విక్రయిస్తున్న చికెన్ షాన్ ఓనర్ అరెస్టు | చికెన్ షాపు యజమాని అరెస్ట్| అమ్మడం| జింక| మాంసం| అడవి


జనవరి 1, 2026 10:29PMన పోస్ట్ చేయబడింది


హైదరాబాద్‌లో అక్రమంగా జింక మాంసం విక్రయిస్తున్నఓ చికెన్ వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన అత్తాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఘటన వెలుగులోకి వచ్చింది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లర్ నంబర్ 233 ప్రాంతంలో చికెన్ షాప్ అయిన మహమ్మద్ ఇర్ఫాన్ ఉద్దీన్‌ జింక మాంసం విక్రయిస్తున్నట్లుగా అందిన విశ్వసనీయ సమాచారం ఫారెస్టు అధికారులు అతని షాపులో తనిఖీలు నిర్వహించి జింక మాంసాన్ని స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. వనపర్తి జిల్లా పెబ్బేరు ఉనికిలో ఉన్న మహమ్మద్ అబ్బు హసన్ అలి జింక మాంసాన్ని తీసుకొచ్చి ఇర్ఫాన్‌కు అందిస్తున్నవాడనీ, ఆ మాంసాన్ని తన చికెన్ షాప్ ద్వారా మహ్మద్ ఇర్ఫాన్ విక్రయించేవాడనీ తేలింది.

అయితే మహమ్మద్ అబ్బు హసన్ అలీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని అధికారులు తెలిపారు. ఇర్ఫాన్ వద్ద నుంచి జింక మాంసాన్ని స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ అధికారులు అతడిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird