డిసెంబర్ 29, 2025 4:46PMన పోస్ట్ చేయబడింది

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు ప్రభుత్వ సలహాదారు (నేచురాపతి)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. పోచంపల్లి శ్రీధర్‌రావు (మాస్ కమ్యూనికేషన్)ను సైతం ప్రభుత్వం సలహాదారుగా నియమించింది.
రెండేళ్ల పాటు వీరు తమ పదవుల్లో కొనసాగుతారు. డాక్టర్ మంతెన సత్యనారాయణ దశాబ్దాలుగా ప్రకృతి వైద్యం ద్వారా ఎంతో మందికి సేవలు అందించారు. ఉండవల్లి కరకట్టపై ప్రకృతి చికిత్సాలయం పేరుతో ఆసుపత్రి ఏర్పాటు చేశారు. విజయవాడ, నరసాపురంలోనూ ఆరోగ్యాలయం కేంద్రాలున్నాయి.
